»Not Sale Kf Beer In Wines Man Complaint To Assistant Collector
not sale kf beers:కేఎఫ్ బీర్లు అమ్మడం లేదు.. 30 కి.మీ వెళ్లాల్సి వస్తోంది ‘ప్రజావాణి’లో ఫిర్యాదు
not sale kf beers:జగిత్యాల జిల్లాలో నాసిరకం బీర్లతోపాటు (beers) కల్తీ మద్యం అమ్ముతున్నారని బీరం రాజేశ్ (beeram rajesh) ప్రజావాణిలో (prajavani) అదనపు కలెక్టర్ లతకు (latha) వినతిపత్రం అందజేశారు. జగిత్యాల టౌన్లో కేఎఫ్ బీర్లు (kf beers) దొరకడం లేదని చెబుతున్నాడు. మిగిలిన చోట్ల దొరుకుతున్నాయని చెప్పాడు.
not sale kf beer in wines, man complaint to assistant collector
not sale kf beers:కింగ్ ఫిషర్ (king fisher) బీర్ (beer).. బీర్లలో రారాజు. స్ట్రాంగ్ అయినా లైట్ అయినా ఆ బ్రాండే వేరు. డిమాండ్ ఎక్కువ. అందుకోసమే కంపెనీ వాడు వైన్ షాపుల వారికి డ్యామేజ్ అయితే ఇవ్వడు. దీంతో కొన్ని షాపులు.. కాదు ఏకంగా జిల్లా హెడ్ క్వార్టర్‌లోనే కేఎఫ్ బీర్లు (kf beers) విక్రయించడం లేదు. ఎక్కడో కాదు.. మన జగిత్యాల జిల్లా కేంద్రంలోనే.. ఇదే విషయం ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో కథనాలు వచ్చాయి. ఈ సారి ఒకతను ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు కంప్లైంట్ ఇచ్చాడు.
జిల్లాలో నాసిరకం బీర్లతోపాటు (beers) కల్తీ మద్యం అమ్ముతున్నారని బీరం రాజేశ్ (beeram rajesh) ప్రజావాణిలో (prajavani) అదనపు కలెక్టర్ లతకు (latha) వినతిపత్రం అందజేశారు. జగిత్యాల టౌన్లో కేఎఫ్ బీర్లు (kf beers) దొరకడం లేదని చెబుతున్నాడు. మిగిలిన చోట్ల దొరుకుతున్నాయని చెప్పాడు. కేఎఫ్ బీర్ల కోసం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని చెప్పాడు. బెల్ట్ షాపుల్లో దొరుకున్నాయని.. కానీ ఒక్కో బీర్‌కు (beer) రూ.200 నుంచి రూ.300 వరకు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
చదవండి:love harassment to rakshita:ప్రేమ వేధింపుల వల్లే రక్షిత ఆత్మహత్య
జిల్లాలో బెల్ట్ షాపులకు కొదవ లేదని చెప్పారు. బెల్ట్ షాపుల్లో దొరికే బీర్లపై సందేహాలు వస్తున్నాయని తెలిపారు. అందుకోసమే ఎక్కువ నగదు పెట్టేందుకు కూడా సందేహాం కలుగుతుందన్నారు. నరేష్ ఇచ్చిన కంప్లెంట్ను సోషల్ మీడియాలో (social media) షేర్ చేశారు. ఇంకేముంది అదీ వైరల్ అయ్యింది. అతని సమస్యపై అధికారులు దృష్టి సారిస్తారా? లేదా అన్నది తర్వాత.. కానీ అతను మాత్రం ఫేమ్ అయ్యాడు. ప్రతీ సోమవారం కలెక్టరేట్లలో ప్రజావాణి (prajavani) నిర్వహిస్తుంటారు. ఇందులో సమస్యలను చెప్పుకోవాల్సి ఉంటుంది. నరేష్ అయితే బీర్లు దొరకడం లేదని.. తన సమస్యను పరిష్కరించాలని కోరాడు.
తమ కాలనీలో నీరు రావడం లేదో.. డ్రైనేజీ క్లీన్ చేయడం అని కోరడమే.. లేదంటే దొమల మందు కొట్టాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తుంటారు. ప్రతీ సోమవారం సమస్యల గురించి కంప్లైంట్స్ రాగా.. వాటిని పరిష్కరిస్తుంటారు. మరీ నరేష్ సమస్యను జిల్లా యంత్రాంగం పరిష్కరిస్తుందో లేదో చూడాలీ మరీ.