»Telangana Minister Niranjan Fires At Chandrababu Naidu
Telangana minister on Chandrababu Naidu: అప్పుడే దమ్ కీ బిర్యానీ ఫేమస్
తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. తెలుగు దేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు వరి అన్నం తెలిసిందన్న ఆయన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. పదకొండవ శతాబ్ధం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అయిందని గుర్తు చేశారు. వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసర్లు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు ఇలా ఎన్నో పంటలు పండించారన్నారు. పదిహేనో శతాబ్ధం నుండే హైదరాబాద్ దమ్ కీ బిర్యానీ ప్రసిద్ధి చెందిన విషయం తెలుసుకోవాలన్నారు.
తెలంగాణ (Telangana) ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugudesam) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) క్షమాపణ చెప్పాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) సోమవారం డిమాండ్ చేశారు. తెలుగు దేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు వరి (Rice) అన్నం తెలిసిందన్న ఆయన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర (Telangana History) తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. పదకొండవ శతాబ్ధం నాటికే కాకతీయుల (Kakatiya) కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అయిందని గుర్తు చేశారు. వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసర్లు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు ఇలా ఎన్నో పంటలు పండించారన్నారు. పదిహేనో శతాబ్ధం నుండే హైదరాబాద్ దమ్ కీ బిర్యానీ (Hyderabad Biryani) ప్రసిద్ధి చెందిన విషయం తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు (Chandrababu Naidu) మరోసారి తన మూర్ఖత్వంతో కూడిన, అవగాహనరాహిత్యాన్ని బయట పెట్టుకున్నారన్నారు. కేవలం మూర్ఖత్వమే కాదని, మూర్తీభవించిన అహంకారానికి పరాకాష్ట అన్నారు. తెలంగాణ ప్రజలకు రెండు రూపాయలకు కిలో బియ్యంతో మాత్రమే తెలుసునని చెప్పడం విడ్డూరమన్నారు. చరిత్ర తెలుసుకోవాలని, చారిత్రక వాస్తవాల మీద అవగాహన లేకుండా తనకు తోచింది మాట్లాడి, అహంకారం ప్రదర్శించడం సరికాదన్నారు. శ్రీనాథుడు ఎప్పుడో ఆరు శతాబ్దాల క్రితం రాశారని, జొన్న కలి, జొన్న అంబలి, జొన్న అన్నం.. జొన్నలే తప్ప, సన్నన్నం సున్న సుమీ.. పండుగ పలనాటి సీమ ప్రజలందరకున్ అని రాశారని గుర్తు చేసుకోవాలన్నారు. ఆ ప్రాంతంలో సన్నన్నం సున్నా అని ఆరు శతాబ్దాల క్రితమే రాశారని గుర్తు చేశారు. అయినా తమకు మరో ప్రాంతం పట్ల వ్యతిరేకత లేదని, కానీ చారిత్రక వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. భారత దేశంలోనే తొలి వరి అన్నాన్ని తిన్న ప్రాంతం తెలంగాణ అని, ప్రపంచానికి వాటర్ షెడ్డు పథకాన్ని, వాటర్ షెడ్డు పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది తెలంగాణ అన్నారు.
విష్ణు కుండీనుల కాలం నుండి కాకతీయుల కాలం నుండి, ఆ తర్వాత నిజాం రాజులు కూడా వాటిని కొనసాగించారని చెప్పారు. తెలంగాణలోని ఎత్తుపల్లాల నేల మీద వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు గొలుసు కట్టు చెరువులను నిర్మాణం చేసిన ప్రాంతం తెలంగాణ అన్నారు. ప్రపంచానికే తెలంగాణ ఆదర్శమన్నారు. సమైక్య రాష్ట్రంలో తమ ప్రాంతంలోని చిన్న నీటి వనరులను ధ్వంసం చేశారని, ఇక్కడ ప్రాజెక్టులు కట్టకుండా, వాటిని జాప్యం చేయడంతో దుర్మార్గ పాలన అందించిన వారు ఆంధ్రా పాలకులు అన్నారు. ఇందుకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. కేసీఆర్ కూడా ఉద్యమం సమయంలో తెలంగాణ బిర్యానీ.. తెలంగాణ షేర్వానీ అని పలుమార్లు చెప్పారన్నారు. పదిహేనో శతాబ్దం నాటికే హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని, వడ్లు పండకుండా, బియ్యం లేకుండా ఎలా కీర్తి వచ్చిందని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రాంతంలో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాల్లో.. ఎగువన నిర్మించిన కృష్ణా బ్యారేజీ, కాటన్ తలపెట్టిన దవళేశ్వరం ప్రాజెక్టులకు వంద లేదా అంతకంటే కొంత ఎక్కువ చరిత్ర మాత్రమే ఉందన్నారు. లక్నవరం, రామప్ప, ఘనపురం చెరువు.. ఇలా లక్షా ఇరవైకి పైగా చెరువులతో వర్ధిల్లిన ప్రాంతం తెలంగాణ అన్నారు. కాకతీయుల కాలంలో చెరువుల చరిత్ర తెలుసుకోవాలన్నారు. మూర్ఖపు మాటలు మాట్లాడినందుకు చంద్రబాబు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ మాటలు మాట్లాడుతూ.. తెలంగాణలోకి టీడీపీ వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.