KMR: గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం భిన్నంగా మారింది. మధ్యాహ్నం ఉక్కపోత, రాత్రి వర్షం, ఉదయం చలి గాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సోమూర్లో అత్యధికంగా 13.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, బిక్కనూరులో 38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జుక్కల్, డోంగ్లి, బీర్కూర్ ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది.