»Telangana Govt Allotted New Vehicle To Bjp Mla Raja Singh
Convoy స్పందించిన ప్రభుత్వం.. రాజా సింగ్ కు కొత్త వాహనం
డొక్కు వాహనం తనకు వద్దని మంచి కండిషన్ లో ఉన్న వాహనం కేటాయించాలని రాజా సింగ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఆయన చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి తాజాగా ఇన్నోవా వాహనం కల్పించింది. అయితే ఈ వాహనం కూడా పాతదే. 2017 మోడల్ కావడం గమనార్హం. దీనిపై రాజా సింగ్ స్పందిస్తూ వాహనం ఏదైనా పర్లేదు. కానీ మంచి కండీషన్ లో ఉంటే చాలని పేర్కొన్నాడు.
పాత వాహనం కేటాయించారంటూ బీజేపీ (BJP) గోషామహల్ (Goshamahal) ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) చేస్తున్న ఆందోళనకు తెలంగాణ ప్రభుత్వం (Govt Of Telangana) స్పందించింది. అతడికి కేటాయించిన పాత వాహనం స్థానంలో మరో వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. వాహనం రాజా సింగ్ ఇంటి ముందు ఉంచారు. అయితే ఆ సమయంలో రాజా సింగ్ ఇంట్లో లేరు. ప్రస్తుతానికి అతడు వాహనాన్ని పరిశీలించలేదు. పరిశీలించిన అనంతరం ఆ వాహనం విషయమై మాట్లాడుతానని పేర్కొన్నాడు.
రాజా సింగ్ కు ప్రభుత్వం ఓ బుల్లెట్ ప్రూఫ్ (Bullet Proof) వాహనం కేటాయించింది. అయితే తనకు కేటాయించిన వాహనాలు (Convoy) మొరాయిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాడు. అయినా పరిస్థితిలో మార్పులేదు. ప్రమాదకరంగా రాకపోకలు సాగించాడు. చాలా సార్లు ప్రయాణంలో మధ్యలోనే వాహనం ఆగిపోయింది. ఒకటి రెండు సార్లు కాదు దాదాపు పది సార్లు నడిరోడ్డు వాహనం మొరాయించింది. ముందుకు కదలలేదు. దీంతో వేరే వాహనంలో రాజా సింగ్ వెళ్లేవాడు. ఒక రోజు అయితే ఏకంగా ప్రయాణ సమయంలోనే వాహనం చక్రం ఊడిపోయింది.
ఫిబ్రవరి 9వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల (Telangana Assembly Budget Sessions)కు హాజరై రాజా సింగ్ తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్ కార్యాలయానికి చేరుకోగానే ఓ వాహనంలోని చక్రం బయటకు ఊడి వచ్చింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో కాన్వాయ్ ఆగిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. రోడ్డు మధ్యలో వాహనం ప్రమాదానికి గురైంది. ఆ తెల్లారి తన వాహనాన్ని తీసుకుని ప్రగతి భవన్ వద్ద వదిలేశాడు. ఈ సందర్భంగా రాజా సింగ్ సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీని కలిసేందుకు ప్రయత్నించగా అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
రాజాసింగ్ వదిలి వెళ్లిన కారును పంజాగుట్ట పోలీసులు (Punjagutta Police) స్టేషన్ కు తరలించారు. అప్పటి నుంచి రాజా సింగ్ ఆ వాహనం వాడడం లేదు. డొక్కు వాహనం తనకు వద్దని మంచి కండిషన్ లో ఉన్న వాహనం కేటాయించాలని రాజా సింగ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఆయన చేస్తున్న ఆందోళనకు ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి తాజాగా ఇన్నోవా వాహనం కల్పించింది. అయితే ఈ వాహనం కూడా పాతదే. 2017 మోడల్ కావడం గమనార్హం. దీనిపై రాజా సింగ్ స్పందిస్తూ వాహనం ఏదైనా పర్లేదు. కానీ మంచి కండీషన్ లో ఉంటే చాలని పేర్కొన్నాడు.
కాగా 2018 ఎన్నికల్లో హైదరాబాద్ లో బీజేపీ నుంచి గెలిచింది రాజా సింగ్ మాత్రమే. హైదరాబాద్ లోనే కాదు మొత్తం తెలంగాణ (Telangana)లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది రాజా సింగ్ ఒక్కరే. గోషామహల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ తీరు వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలు పక్కన పడేసి మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ముందే అభివృద్ధిలో వెనుకబడిన గోషామహల్ పై దృష్టి సారించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు పాలయ్యాడు.