»Perini Rajkumar Naik Praised By Pm Narendra Modi In Mann Ki Baat
Mann ki Baat తెలంగాణ కళాకారుడికి ప్రధాని ప్రశంసలు.. శభాష్ రాజ్
కళల (Arts)కు కాణాచిగా తెలంగాణ విలసిల్లుతోంది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ ఆలవాలంగా నిలుస్తోంది. ఎన్నో అద్భుత కళలకు నిలయంగా ఉన్న తెలంగాణ (Telangana)లో పేరిణి నృత్యం (Perini Dance) ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దైవ భక్తితో కూడిన ఈ నృత్యం చేయడం కత్తి మీద సాములాంటిది. భక్తితో పాటు నవరసాలను ఒలికించడం ఈ నృత్యం ప్రత్యేకత.
కళల (Arts)కు కాణాచిగా తెలంగాణ విలసిల్లుతోంది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ ఆలవాలంగా నిలుస్తోంది. ఎన్నో అద్భుత కళలకు నిలయంగా ఉన్న తెలంగాణ (Telangana)లో పేరిణి నృత్యం (Perini Dance) ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దైవ భక్తితో కూడిన ఈ నృత్యం చేయడం కత్తి మీద సాములాంటిది. భక్తితో పాటు నవరసాలను ఒలికించడం ఈ నృత్యం ప్రత్యేకత. అలాంటి నృత్యంలో ధరావత్ రాజ్ కుమార్ నాయక్ (Dharavath Rajkumar Naik) ప్రసిద్ధుడు. పేరిణి నృత్యంలో రాజ్ కుమార్ అద్భుతంగా చేస్తాడు. అతడి ప్రతిభను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గుర్తించాడు. అతడు నృత్య రీతులు తెలుసుకున్న మోదీ రాజ్ కుమార్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ ను అభినందిస్తూ ‘మన్ కీ బాత్ (Mann ki Baat)’లో మోదీ మాట్లాడారు. తన ప్రసంగంలో రాజ్ కుమార్ ను ప్రశంసించాడు.
సూర్యాపేట జిల్లా (Suryapet District) చివ్వెంల మండలం బీబీగూడెం తండాకు చెందిన నృత్య కళాకారుడు ధరావత్ రాజ్ కుమార్ నాయక్. తెలంగాణ అధికారిక నృత్యం పేరిణితో పాటు ఒడిస్సీ (Odissi) నాట్యం కూడా రాజ్ కుమార్ చేస్తాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తెలంగాణ నృత్య కళాకారుడు రాజ్ కుమార్ నాయక్ ప్రదర్శన ఇచ్చాడు. తనదైన నృత్యంతో ప్రేక్షకులను మెప్పించడంతో రాజ్ కుమార్ బహుమతి సాధించాడు. ప్రతిభ కనబర్చిన రాజ్ కుమార్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహుమతి అందించి సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ సేవలను అభినందించారు. అయితే ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ ‘మనసులో మాట (Mann ki Baat) కార్యక్రమం నిర్వహిస్తారు. తాజాగా ఫిబ్రవరి 28న నిర్వహించిన మనసులో మాటలో రాజ్ కుమార్ విషయమై మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఈ సందర్భంగా పేరిణి నృత్యం గొప్పతనం, రాజ్ కుమార్ చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. ‘కాకతీయుల కాలం (Kakatiyas)లో మహాదేవుడు శివుడికి అంకితం చేసిన పేరిణి నాట్యం ఎంతో పేరొందింది. ఆ రాజవంశ మూలాలు ఇప్పటికీ తెలంగాణలో ముడిపడి ఉన్నాయి’ అని మోదీ ప్రశంసించాడు.
పేరిణిలో విశేష కృషి
ధరావత్ సక్రి, నర్సింహ కుమారుడు రాజ్ కుమార్. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. చిన్నప్పటి నుంచి నృత్యంపై రాజ్ కుమార్ కి ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే పేరిణి నేర్చుకున్నాడు. 15 ఏళ్ల వయసులో సూర్యాపేటకు చెందిన అబ్దుల్ పాషా వద్ద నృత్యం నేర్చుకుని విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో తన ప్రదర్శనలు ఇచ్చాడు. ఇక హైదరాబాద్ కు చెందిన డాక్టర్ నటరాజ రామకృష్ణ వద్ద పేరిణి శివతాండవ నృత్యాన్ని రాజ్ కుమార్ తర్ఫీదు పొందాడు. పేరిణి ప్రదర్శనలు ఇస్తూ తెలంగాణ కళను ప్రపంచానికి చాటుతున్నాడు. ఇక రాజ్ కుమార్ సూర్యాపేటలో ‘పేరిణి రాజ్ కుమార్ డ్యాన్స్ ఇన్ స్టిట్యూట్ (పీఆర్కే) ఏర్పాటు చేశాడు. ఐదేళ్ల నుంచి స్థానిక యువతకు పేరిణి నృత్యంలో శిక్షణ ఇస్తున్నాడు. ఇటీవల రాజ్ కుమార్ కు ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ -2022’ అవార్డు లభించింది.