»Fake Baba Fraud In Mahabubnagar Rangareddy Districts
Fake Baba పుట్టు మచ్చల పేరిట న్యూడ్ ఫొటోలు.. దొంగ బాబా ఆగడాలు
మీ జాతకాలు చూస్తాం.. హస్తరేఖలు (Palmology), పుట్టుమచ్చలు (Moles), ఇతర మరకల ఆధారంగా ఉన్నది ఉన్నట్లు చెబుతామని చెప్పి వ్యక్తిగత ఫొటోలు తీసుకుంటున్న ముఠా ఆగడాల గుట్టు రట్టయ్యింది. వారు చేస్తున్న బాగోతాలు అన్నీ బహిర్గతమయ్యాయి.
మూఢ నమ్మకాల (Superstitions)ను ఆసరాగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. మన అమాయకత్వమే వారికి ఆదాయ వనరుగా మారుతున్నది. ఈ విధంగానే ఓ ముఠా ఉమ్మడి మహబూబ్‌నగర్ (MahabubNagar), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల్లో మూఢ నమ్మకాల పేరుతో మోసాలకు పాల్పడింది. ఏకంగా మహిళలు, యువతులకు సంబంధించి న్యూడ్ ఫొటోలు సేకరించి వేధింపులకు పాల్పడుతున్నారు. మీ జాతకాలు చూస్తాం.. హస్తరేఖలు (Palmology), పుట్టుమచ్చలు (Moles), ఇతర మరకల ఆధారంగా ఉన్నది ఉన్నట్లు చెబుతామని చెప్పి వ్యక్తిగత ఫొటోలు తీసుకుంటున్న ముఠా ఆగడాల గుట్టు రట్టయ్యింది. వారు చేస్తున్న బాగోతాలు అన్నీ బహిర్గతమయ్యాయి. పోలీసులు ముఠాలోని ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పారిపోయారు.
‘మీరు కోరినట్లుగా జాతకం మారుస్తాం.. ఆ తర్వాత మీరు అనుకున్నది జరుగుద్ది.. కనకవర్షం కురిపిస్తాం’ అంటూ అమాయక మహిళలను నమ్మించే ప్రయత్నం ఓ ముఠా చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో జాతకాలు మారుస్తామంటూ కొందరు మూడు నెలల క్రితం తమ స్థానిక ప్రాంతాల్లో జైనుల్లబుద్దీన్ బాబా (Jainabullahddin) పేరిట జ్యోతిష్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఠాలోని సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లా (NagarKurnool District) తిమ్మాజీపేట మండలంలోని కోడుపర్తి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లా ఆమన్‌గల్‌లో ఎవరి ఇళ్ల వద్ద కేంద్రాలు ఏర్పాటుచేసి కార్యకలాపాలు ప్రారంభించారు. తమ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందంటూ తెలిసిన వారి నుంచి విస్తృత ప్రచారం చేయించారు. పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించే మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. శరీరంపై పుట్టుమచ్చలను స్వయంగా చూస్తేనే జాతకం పక్కాగా ఉంటుందని చెప్పి.. న్యూడ్ ఫొటోలు కావాలని కోరారు. తాము చూసి వాటిని పైకి (పెద్ద బాబా) పంపిస్తామని నమ్మబలికారు. అక్కడ అమ్మవారికి పూజలు చేస్తారని.. మీకు అమ్మవారి పూనకం వస్తుందని.. ఆతర్వాత కనక వర్షం కురుస్తుందని నమ్మించే ప్రయత్నం చేశారు. అలా నమ్మిన మహిళలు తమ న్యూడ్ ఫొటోలను పంపించారు.
ఫొటోలు పంపిన అనంతరం వారు తమ అసలు రూపం బయటపెట్టారు. తమ వద్దకు మూడు పర్యాయాలు రప్పించుకుని న్యూడ్ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్‌కు తెరలేపారు. వీరి బెదిరింపులకు తాళలేక ఓ మహిళ స్థానిక జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేస్తూ దర్యాప్తు ప్రారంభించగా తవ్విన కొద్దీ వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితుల సమాచారం మేరకు జైనొద్దీన్, రాములును ఓ పౌల్ట్రీ ఫామ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణ క్రమంలో తిరుపతి, శంకర్ అనే పేర్లు వెలుగులోకి వచ్చారు. వారిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. హిందూ మహిళలే లక్షంగా దొంగ బాబాలు కుట్ర పన్నారని ఆరోపించారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. అయితే మూఢ నమ్మకాలను వద్దని ప్రజా సంఘాలు సూచిస్తున్నాయి. వాటిని నమ్మితే మనమే బలయ్యేదని పేర్కొంటున్నారు.