»Street Dogs Attack Anchor Rashmi Gautam Fire On Netizen In Twitter
Rashmi Gautham అడ్రస్ పంపు.. నీ ఇంటికి వస్తా.. నెటిజన్ పై యాంకర్ రష్మీ ఆగ్రహం
రష్మీ చేసిన విధానం కూడా బాగా లేదని ఇంకొందరు చెబుతున్నారు. అక్కడ అధికారులది, ప్రభుత్వానిది తప్పు లేదు. కానీ రష్మీ ప్రభుత్వాన్ని తిట్టడం సరికాదని పేర్కొంటున్నారు. కాగా రష్మీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. గతంలో ఆమెకు ఇలాంటి సంఘటనలు చాలా ఎదురయ్యాయి.
వీధి కుక్కల (Street Dogs) దాడి (Dogs Attack)లో బాలుడు మృతి చెందిన సంఘటన అందరినీ కలచివేసిన విషయం తెలిసిందే. చిన్నారిని కుక్కలు దాడి చేసుకుని పీక్కు తింటున్న దృశ్యాలు అయ్యో పాపం అనేలా చేశాయి. ఈ సంఘటనపై యాంకర్ (Anchor), హీరోయిన్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) స్పందించి ఓ ట్వీట్ చేసింది. చిన్నారి మృతిపై అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక కుక్కల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేసింది. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు, ఆమె ఫాలోవర్లు భిన్నంగా స్పందించారు. ఓ యువకుడు శ్రుతిమించి రష్మీని శునకంతో పోల్చాడు. దీంతో రష్మీకి సుర్రున కోపమొచ్చేసింది. అతడికి సంచలన సవాల్ విసిరింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలుడిపై దాడి విషయమై రష్మీ ఈనెల 22న చేసిన ట్వీట్ (Tweet)పై వివాదం రేగుతోంది. ‘ఇది అత్యంత బాధాకరమైన సంఘటన. తన తప్పు లేకుండానే వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందాడు. కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్కల జననాల నియంత్రణకు వ్యాక్సినేషన్ ను తప్పనిసరిగా అమలు చేయాలి. వాటితో పాటు కుక్కలకు ప్రత్యేకంగా వసతి సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే అవి కూడా మనలాగే జీవులు’ అని రష్మీ గౌతమ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో కుక్కలు మనలాగే జీవులు అనే మాట వాడడం దుమారం రేపుతున్నది.
ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు ఈ ట్వీట్ పై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సానుభూతి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఆమెను దూషిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ మరింత రెచ్చిపోయి రష్మీని కుక్కతో పోల్చాడు. ‘ఈ కుక్క రష్మీని.. కుక్కను కొట్టినట్టు కొట్టాలి’ అంటూ రష్మీ చేసిన ట్వీట్ కు కామెంట్ చేశాడు. ఇది చూసిన రష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అతడి ట్వీట్ కు ఘాటు సమాధానం ఇచ్చింది. ‘తప్పకుండా. నీ అడ్రస్ చెప్పు. వ్యక్తిగతంగా నేనే వస్తా. ఎలా కొడతావో నేను చూస్తా. ఇదే నా చాలెంజ్’ అంటూ రష్మీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఆమెను కుక్కతో పోల్చడం చాలా మంది ఖండిస్తున్నారు. రష్మీకి అండగా పలువురు ట్వీట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రష్మీని ఆ విధంగా దూషించిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రీట్వీట్లు పెడుతున్నారు. అందరినీ గౌరవించాలని హితవు పలుకుతున్నారు. ఒక యాంకర్ ను పట్టుకుని అంత మాట అంటావా బ్రో అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే రష్మీ చేసిన విధానం కూడా బాగా లేదని ఇంకొందరు చెబుతున్నారు. అక్కడ అధికారులది, ప్రభుత్వానిది తప్పు లేదు. కానీ రష్మీ ప్రభుత్వాన్ని తిట్టడం సరికాదని పేర్కొంటున్నారు. కాగా రష్మీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. గతంలో ఆమెకు ఇలాంటి సంఘటనలు చాలా ఎదురయ్యాయి.