»Ap Govt Named To Narketpally Addaki Highway As Kasu Brahmananda Reddy Expressway
Name Changed మరో పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
పలుకుబడి ఎవరికి అధికంగా వారి పేర్లు వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం పాకులాడుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకుల పేర్లు వాడుకుంటోంది. పేర్లు పెట్టడం ద్వారా ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
పేర్లు మార్చడంపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Govt of Andhra Pradesh) దృష్టి సారించింది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవల విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య శాస్త్ర విశ్వవిద్యాలయం (NTR Health University) పేరును మార్చిన విషయం తెలిసిందే. మరికొన్ని పేర్లు మార్చింది. తాజాగా విజయవాడ నడిబొడ్డున ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరును మార్చేందుకు ప్రయత్నాలు చేసింది. దీనిపై తీవ్ర దుమారం రేపడంతో వెనుకడుగు వేసినట్టు తెలుస్తున్నది. ఇది మరువకముందే మరో పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చివేసింది. ఓ జాతీయ రహదారికి కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకుడు పేరు పెట్టడం గమనార్హం. అంటే పలుకుబడి ఎవరికి అధికంగా వారి పేర్లు వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం పాకులాడుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకుల పేర్లు వాడుకుంటోంది. పేర్లు పెట్టడం ద్వారా ఆయా వర్గాల ఓటర్లను ఆకర్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి (Kasu Brahmananda Reddy) పేరును తెరపైకి తీసుకువచ్చింది. తెలంగాణ (Telangana)లోని నార్కట్ పల్లి (Narketpally), ఏపీలోని అద్దంకి (Addanki) మధ్య ఉన్న రహదారికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ ప్రెస్ వే (Kasu Brahmananda Reddy Expressway)గా ఏపీ ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి ఆయన చేసిన సేవలు, అభివృద్ధిని గుర్తించి ప్రభుత్వం జాతీయ రహదారికి అతడి పేరు పెట్టినట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. హైదారాబాద్ (Hyderabad)-విజయవాడ హైవే, విజయవాడ-చెన్నై హైవేలను కలుపుతూ పల్నాడు ప్రాంతంలో ఉన్న అద్దంకి-నార్కెట్ పల్లి జాతీయ రహదారికి ఈ పేరును పెట్టింది. దాదాపు 200 కిలోమీటర్లు ఈ రహదారి ఉంది. జాతీయ రహదారికి తమ తాత పేరు పెట్టడంపై గురజాల (Gurajala) వైఎస్సార్ సీపీ (YSRCP) ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశాడు.
అయితే పల్నాడు (Palnadu) ప్రాంతానికి చెందిన నాయకుడు కాసు పేరు అకస్మాత్తుగా ఏపీ ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకు వచ్చిందోనని రాజకీయ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న కేబీఆర్ (KBR) వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తున్నది. వాస్తవంగా కేబబీఆర్ ఒక దశాబ్ద కాలం పాటు ఉమ్మడి ఏపీని పాలించాడు. కానీ అతడికి అంతగా మంచి పేరు లేదు. రాజకీయం కోసం ఎంతటి దారుణాలకైనా పాల్పడే వ్యక్తిగా పేరు ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేసిన వ్యక్తి కేబీఆర్. తన పాలనా కాలంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన వర్గానికి ప్రాధాన్యం లేదు. మరి అలాంటి వ్యక్తికి ఈ పేరు పెట్టడం విస్మయం కలిగిస్తోంది. రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నదనేది వాస్తవమే. కేబీఆర్ పేరు కాకుండా ఇతర స్వాతంత్ర్య సమరయోధులు, సమాజానికి మంచి చేసిన వారి పెట్టాల్సి ఉందని పలువురు సలహా ఇస్తున్నారు. కేబీఆర్ వంటి దుర్మార్గుడి పేరు జాతీయ రహదారిపై పెట్టడం ఇది దుర్మార్గమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడుతున్నాయి.