Rashmi Gautam : సుడిగాలి సుధీర్‌కు షాక్.. అతనితో రష్మీ పెళ్లి?
సుడిగాలి సుధీర్, రష్మీ జోడీ ఎప్పటికీ హాట్ టాపికే. జబర్దస్త్ షో అయినా, మరో షో అయినా.. ఈ ఇద్దరి పెళ్లి ప్రస్థావన లేకుండా.. షో కంప్లీట్ అవడం కష్టం. షో నిర్వాహకులు కూడా దీన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు రష్మీ వేరు వాడితో పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా.. కాబోయే వాడిని పరిచయం చేసింది.
యాంకర్ రష్మితో సుడిగాలీ సుధీర్ ప్రేమలో ఉన్నాడనేది గత కొన్నాళ్లుగా వినిపిస్తునే ఉంది. ఈ ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుంది. అందుకే.. ఆన్ స్క్రీన్‌లో సుడిగాలి సుధీర్, రష్మీ రొమాన్స్ చూసి.. ఆఫ్ స్క్రీన్‌లోను ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని గట్టిగా నమ్ముతున్నారు జనాలు. కానీ ఈ విషయంలో ఎప్పుడు ఓపెన్ అవడం లేదు సుధీర్, రష్మీ. బుల్లితెరపై హాట్ జోడీగా పేరు తెచ్చుకున్న గాలోడు, రష్మీ.. ప్రస్తుతం సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు.
అభిమానులు కూడా సుధీర్-రష్మీ జంటను పెద్ద తెరపై చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. త్వరలోనే ఇద్దరు కలిసి ఓ సినిమా కూడా చేసే ఛాన్స్ ఉంది. కానీ పెళ్లి మ్యాటర్ మాత్రం తేలడం లేదు. ఇద్దరి మధ్య రిలేషన్ బుల్లితెరకే పరిమితం.. ఇద్దరి మధ్య ఏం లేదని తరచుగా చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఆ మధ్యా.. సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడు కాబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా టాక్ నడిచింది. కానీ ఇప్పుడు రష్మీ ఏకంగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసి షాక్ ఇచ్చింది.
న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో రష్మీ పెళ్లి పార్టీ అని ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇందులో రష్మీ.. తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అయితే.. అతను ఓ విదేశీయుడు కావడం విశేషం. ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలని ఇమాజినేషన్స్ ఉంటాయి.. ఇతనే అతను అని చెప్పుకొచ్చింది రష్మీ. అయితే.. రష్మీ చెప్పింది నిజమేనా? లేదంటే, ఎప్పటిలాగే ఇది ఈవెంట్ కోసం పబ్లిసిటీ స్టంటా? అనేది తెలియాల్సి ఉంది. మరి నిజంగానే రష్మీ పెళ్లి చేసుకుంటే.. సుధీర్ పరిస్థితి ఏంటనేది? ఫ్యాన్స్ మాట.