సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ పుట్టపర్తికి వచ్చారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా మహాసమాధిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం టీడీపీ నేత ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రశాంతి నిలయం అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో సాయికుమార్‌ను పూలమాలలతో సత్కరించారు. ఉత్సవాల్లో పాల్గొనడంపై సాయికుమార్ సంతోషం వ్యక్తం చేశారు.