KDP: జిల్లా బీసీ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్లయ్య నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు పీవీ రమణ, ఉపాధ్యక్షులు మల్లేష్ నియామక పత్రం అందజేశారు. అనంతరం మల్లయ్య మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. గ్రామస్థాయి నుంచి బీసీ మహాసభలను బలోపేతం చేస్తామన్నారు. కుల గణన, జనగణన చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.