»Is Skin Show Part Of Sanatana Dharma Rashmi Responds
Rashmi: ఎక్స్ పోజింగ్ చేయడం సనాతన ధర్మమా? నెటిజన్ ప్రశ్నకు రష్మి సమాధానం!
పాపులర్ టీవీ యాంకర్ రష్మీ గౌతమ్(rashmi gautam) గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె చాలా కాలంగా ఇండస్ట్రీలో చాలా టీవీ షోల్లో పని చేశారు. ఆమె సోషల్ మీడీయాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. తనకు నచ్చిన విషయాలను, అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సనాతన ధర్మం గురించి తనదైన శైలిలో స్పందించింది.
Is Skin Show Part Of Sanatana Dharma Rashmi Responds
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్(rashmi gautam) ఎక్కువగా స్త్రీ వాదం గురించి, వీధి కుక్కల గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే, ఆమె ఈ సారి సనాతన ధర్మం గురించి మాట్లాడింది. అయితే ఆమె మాట్లాడిన దానికి, ఓ నెటిజన్ కౌంటర్ వేశాడు. దారుణంగా ట్రోల్ చేసినవారు కూడా ఉన్నారు. స్కిన్ షో ఎక్స్ పోజింగ్ చేయడం కూడా సనాతన ధర్మమేనా? అయితే ఇటీవల బాయ్స్ హాస్టల్ మూవీలో చాలా విషయాలు తెలుసుకున్నామని ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. కాగా ఆ కౌంటర్ కి, రష్మి కూడా సమాధానం చెప్పింది. వాదన గెలవలేనప్పుడు వాళ్ళ దగ్గర పాయింట్ లేనప్పుడు ఇలాంటి చెత్త చర్యలకు దిగుతారని ఆమె కౌంటర్ వేశారు. నాతో నిర్మాణాత్మకంగా వాదించలేనివాళ్ళు ఇలాంటి ఫోటోలు పెట్టి, సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని ఆమె అసహనం వ్యక్తం చేసింది. రష్మీ గౌతమ్ రిప్లై వైరల్ అవుతుంది.
ఇది సంస్కృతిలో భాగమని..మరి మీరు ఏ స్కిన్ షో గురించి మాట్లాడుతున్నారు? దండయాత్రలు జరగడానికి ముందు మేము ఎలా దుస్తులు ధరించామో దయచేసి తెలుసుకోవాలని హితవు పలికారు. హిందూ బాలికలు ఎలా ధరించారు లేదా ఏమి ధరించారు అనేది తెలుసుకోవాలన్నారు. మేము ఎప్పుడూ ఇంత నిస్సారంగా లేము. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆంక్షలు మానవ నిర్మితమే. వాటికి హిందూ మతం లేదా సనాతన ధర్మంతో సంబంధం లేదు అంటూ రష్మీ పేర్కొంది. ‘సనాతన ధర్మం’ గురించి మాట్లాడే హీరోయిన్లు ముందుగా స్కిన్ షో చేయడం మానేయాలి అనే వ్యాఖ్యను వెంటనే తోసిపుచ్చారు. హిందూ మతం, సనాతన ధర్మానికి చెందిన చాలా మంది మద్దతుదారులు రష్మీకి మద్దతుగా నిలిచారు. అయితే పొరుగు రాష్ట్ర హీరో చేసిన వ్యాఖ్యలను ఖండించినందుకు ఆమెపై వేళ్లు చూపిస్తున్న ఈ నకిలీ మేధావులతో చర్చల్లో పాల్గొనవద్దని కోరారు.