»Pan India Stars In Kamal Haasans Next Movie Project Kh234
KH234: కమల్ హాసన్ తదుపరి ప్రాజెక్ట్ లో పాన్ ఇండియా స్టార్స్!
యూనివర్సల్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం వెండితెరపై మ్యాజిక్ చేయనున్నారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత వీరు మళ్లీ కలిసి పనిచేయనున్నారు. ఈ ప్రాజెక్టును Kh234 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. మూవీ మొదలు కాకముందే అంచనాలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. గతంలో వీరు నాయకుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Pan India stars in Kamal Haasan's next movie project kh234
పొన్నియన్ సెల్వన్ లాంటి బిగ్ ప్రాజెక్ట్ తర్వాత మణిరత్నం తీస్తున్న సినిమా Kh234. వర్కింగ్ టైటిల్ గా KH234గా పిలుస్తున్నారు. ఈ మూవీని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. కమల్ హాసన్, మణిరత్నం, జి మహేంద్రన్, శివ అనంత్ ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సగర్వంగా సమర్పిస్తోంది. స్టార్ హీరోయిన్ త్రిష, జయం రవి, పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ లాంటివారు ఈ చిత్రంలో యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
విక్రమ్ సినిమాలోనూ కమల్ తనతో పాటు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లాంటివారు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు కమల్ కొత్త సినిమాలో మరి కొందరు పాన్ ఇండియా స్టార్స్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీ కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారట. వీరు మాత్రమే కాకుండా, మరి కొందరు స్టార్స్ ని కూడా సెలక్ట్ చేయనున్నారట. ఇప్పటికే, ఎంపిక చేసిన నటులకు మణిరత్నం కథను వినిపించారని, వారు కూడా మూవీ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.