కమల్ హసన్, మణిరత్నం లాంటి ఉద్దండపిండాలు కొలువుతీరిన వేదిక. ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర సృష్టించిన యోధానుయోధులు. సినిమా చూస్తేనేమో చరిత్రమార్చే రేంజ్లో తయారైన ఓ కళాఖండం. అక్కడ వాళ్ళ సంబరాలతోనే పొద్దుపోయేంత నిడివి ఉన్నంత భారీ వ్యవహారం. అందులో, అటువంటి అతిరథమహారథుల సమక్షంలో ఓ పాత్రికేయుడికి అనురాగపూర్వకమైన గౌరవప్రపత్తులు లభించాయంటే మీడియా మొత్తం గర్వపడే క్షణాలవి.
అనుకుంటే అందరికీ అన్నీ సాధ్యం కావు. కానీ అనుకోకుండా కూడా కొన్ని సాధ్యమవుతాయి. అది కొన్నిసార్లు ఆ వ్యక్తి పనిచేసే ప్రాంతానికి, విభాగానికి ఏకమొత్తం మీద గౌరవాన్ని, ప్రతిష్టని ఆపాదిస్తాయి. అటువంటిదే నిన్న థగ్‌లైఫ్ ప్రెస్మీట్లో జరిగింది. సినిమాకి సంబంధించిన నటీనటులకో, సాంకేతికనిపుణులకో అటువంటి సన్మానసత్కారాలు సర్వసహజం. అందులో పెద్ద చెప్పుకోదగ్గ అబ్బురం గానీ, అందంగానీ ఏముంటాయి?
కమల్ హసన్, మణిరత్నం లాంటి ఉద్దండపిండాలు కొలువుతీరిన వేదిక. ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర సృష్టించిన యోధానుయోధులు. సినిమా చూస్తేనేమో చరిత్రమార్చే రేంజ్లో తయారైన ఓ కళాఖండం. అక్కడ వాళ్ళ సంబరాలతోనే పొద్దుపోయేంత నిడివి ఉన్నంత భారీ వ్యవహారం. అందులో, అటువంటి అతిరథమహారథుల సమక్షంలో ఓ పాత్రికేయుడికి అనురాగపూర్వకమైన గౌరవప్రపత్తులు లభించాయంటే మీడియా మొత్తం గర్వపడే క్షణాలవి. ఆ పాత్రికేయుడు కూడా ఆసామాషీ వ్యక్తి కాదు. ఈ రోజున చిత్రపరిశ్రమ వ్యవహరాలన్నిటినీ సాంఘిక మాధ్యమాలన్నిటిలో తనదైన వ్యాఖ్యలు, వ్యాఖ్యానాల ద్వారా అత్యంత ప్రతిభావంతంగా ప్రభావితం చేయడమే కాకుండా, చిత్ర పరిశ్రమ లోనే కాకుండా జనరల్ పబ్లిక్‌లో కూడా తన ఇంటర్వ్యూల ద్వారా ఎనలేని కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న పాత్రికేయుడు. గ్రేట్ ఆంధ్రా మూర్తిగా ప్రపంచవ్యాప్తంగా సినీఅభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని, ఓ రకంగా మీడియాని తనదైన కోణంలో ఏలుతున్న పాత్రికేయ దురంధురుడు గ్రేట్ ఆంధ్రా మూర్తి. తను సేవలందిస్తున్న సంస్థ గొప్పతనానికి, తనదైన ప్రత్యేకతను ఆపాదించడంలో దిట్టగా పేరుపడ్డారు మూర్తి.
అటువంటి పాత్రికేయ విశిష్టుడికి కమల్ హసన్, మణిరత్నం సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరగడం నిజంగా పాత్రికేయ వ్యవస్థకే లభించిన గౌరవంగా పరిశ్రమంతా ఈ రోజున భావిస్తోంది. థగ్‌లైప్ ఫంక్షన్ వేదికపైనే మూర్తి బర్త్ డే కేక్‌ని కట్ చేయడం, మణిరత్నం, కమల్ హసన్ వంటి శిఖరాయమానమైన స్రష్టలు మూర్తికి పుట్టినరోజు శుబాకాంక్షలు అందివ్వడం నిజంగా ఓ చిరస్మరణీయమైన ఘట్టం. అయితే ఇక్కడ పిఆర్వోలను కూడా మెచ్చుకుని తీరాలి. వాళ్ళకి ఈ రకమైన అభిరుచి గనక లేకపోతే ఈ సంఘటనకు తావే లేకుండా పోయేది. పిఆర్వోలు వంశీశేఖర్ కాంబో మాకెందుకులే అనుకోకుండా మూర్తిలాంటి ఓ పాత్రికేయ అగ్రేసరుడికి ఇటువంటి గౌరవం లభించాలి. అది మేమే జరిపించాలి అనుకోవడమే ఇందులో ప్రత్యేకత. వారిని ఆ విధంగా తనదైన కెరీర్ రికార్డుతో మూర్తి కూడా ఇక్కడ పశంసనీయుడే.