»Huzurabad Brs Member Padi Kaushik Reddy Comments Ec Orders Issued
Padi Kaushik Reddy: వ్యాఖ్యలపై..ఈసీ ఆదేశాలు జారీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(central election commission) రియాక్ట్ అయ్యింది. ఈ అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన నిన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర..లేదంటే తమ కుటుంబం శవయాత్ర ఉంటుందని పేర్కొన్నారు. మీరు ఎవరికి ఓటు వేయాలనేది మీ నిర్ణయం. మీరు నాకు ఓటు వేస్తే, నేను మీ కోసం పని చేస్తాను. లేని పక్షంలో డిసెంబర్ 4న నా డెడ్ బాడీని చూస్తారని కౌశిక్ రెడ్డి అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నానని..మీరు నా ఆత్మహత్య నుంచి రక్షిస్తారని ఆశిస్తున్నానని వెల్లడించారు. అంతేకాదు తన కుటంబ సభ్యులు ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని వ్యాఖ్యానించారు.
ఈ వాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(central election commission) స్పందించింది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజురాబాద్(huzurabad) ఎన్నికల అధికారులను ఆదేశించింది. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు అయిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నికలకు నెలల ముందు BRS పార్టీలో చేరారు. అతను BRSలో చేరిన తర్వాత, అతను గవర్నర్ కోటా క్రింద శాసన మండలి సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు, కానీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దానిని తిరస్కరించారు. ఆ తర్వాత కౌన్సిల్ ఎన్నికల ద్వారా ఎమ్మెల్సీ అయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు. జూన్ 2023లో భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి హుజూరాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున తన భర్తను హత్య చేయడానికి కౌశిక్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
జూన్ 2023లో ఆదిలాబాద్ BRS ఎమ్మెల్యే జోగు రామన్న, ముదిరాజ్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. స్థానిక రిపోర్టర్‌పై కౌశిక్ దాడి చేశాడని, అతని కుటుంబాన్ని బెదిరించాడని, రిపోర్టర్‌కు చెందిన ముదిరాజ్ కమ్యూనిటీని దుర్భాషలాడాడని ఆరోపణలు వచ్చాయి. ఈటల రాజేందర్ కూడా ముదిరాజ్ వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.