»Telangana Assembly Elections 2023 This Polling Precautions Compulsory
Vote: వేసేందుకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
తెలంగాణలో ఎన్నికల హాడావిడి చివరి దశకు వచ్చేసింది. రేపు(నవంబర్ 30న) అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఉన్న నేపథ్యంలో అసలు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి? ఏం తీసుకెళ్లకూడదనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
telangana assembly elections 2023 this polling precautions must
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ సమయం రానే వచ్చింది. రేపు(నవంబర్ 30న) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఈ నేపథ్యంలో ఓటు వేయాలనుకునే ప్రజలు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కొంత మంది నగరాల నుంచి గ్రామాలకు వెళ్తున్న యువత నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అసలు పోలింగ్ కేంద్రానికి ఏం తీసుకెళ్లాలని అంశాలను ఇప్పుడు చుద్దాం.
-ముందుగా మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తుందో ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవాలి లేదా స్థానిక అధికారులను అడగండి.
-రాజకీయ పార్టీల రంగులు ఉన్న దుస్తువులు, టోపీలు ధరించి ఓటు వేసేందుకు వెళ్లొద్దు
-పోలింగ్ కేంద్రానికి సెల్ ఫోన్ నిషేధం, సిబ్బందికి మాత్రమే అనుమతి
-అక్రమంగా ఫోన్ తీసుకెళ్లి పట్టుబడితే పోలీసులు కేసు నమోదు చేస్తారు
-పోలింగ్ కేంద్రానికి కెమెరా, ల్యాప్ టాప్ కూడా తీసుకెళ్లొద్దు
-ఓటర్లు తమ ఓటింగ్ ప్రక్రియ గురించి చిత్రాలు లేదా వీడియోలు తీయడం కూడా నిషేధం
-ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ లేదా ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి
-ఎన్నికల సంఘం సూచించిన 12 కార్డులలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును ఓటు వేసే క్రమంలో తీసుకెళ్లవచ్చు
ఎన్నికల సంఘం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులు
-ఆధార్ కార్డ్
-EPIC (ఓటర్ ID కార్డ్)
-పాస్పోర్ట్
-డ్రైవింగ్ లైసెన్స్
-కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/పీఎస్యూలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఉద్యోగులకు జారీ చేయబడిన ఫోటోతో కూడిన సేవా గుర్తింపు కార్డులు
-బ్యాంక్/పోస్టాఫీసు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్లు
-పాన్ కార్డ్
-NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్
-MNREGA జాబ్ కార్డ్ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ)
-కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్
-ఫోటోతో కూడిన పెన్షన్ పత్రం
-MPలు/MLAలు/MLCలకు జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు