కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నేతలు మంగళవారం రాత్రి ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
Bandi Sanjay said BRS leaders caught sharing Rs 10000 per vote in Karimnagar kothapalli
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం ముగియడంతో ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు పలు పార్టీలు సిద్ధమయ్యాయి. ఆ క్రమంలోనే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు సైతం ఆయా అభ్యర్థులపై నిఘా పెట్టాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడ, కరీంనగర్లో బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.
Breaking.!!
BRS karyakartas were caught by BJP karyakartas while distributing money in Karimnagar constituency.
BRS people have attacked BJP karyakartas. Bandi Sanjay reached the spot.
కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లిలో తమ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు ఓటరు స్లిప్పులతో పాటు డబ్బులు పంచుతున్న బీఆర్ఎస్ నాయకులను బీజేపీ(BJP) కార్యకర్తలు పట్టుకున్నారు. దీంతో కరీంనగర్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న బీజేపీ నేతలు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి కమలాకర్(gangula kamalakar)కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ నేతలు వారిని వెనక్కి నెట్టేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో కొత్తపల్లికి చేరుకున్న బండి సంజయ్(bandi sanjay) ఎన్నికల సంఘం, పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి సంజయ్‌ను బలవంతంగా ఆ ప్రాంతం నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి గంగుల కమలాకర్ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు. మరోవైపు వికారాబాద్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. పోలీసులు రంగంలోకి దిగి కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారి ఓటర్లకు భారీగా నగదు పంపిణీ చేస్తుండగా పట్టుకున్నట్లు ఆప్ కార్యకర్తలు తెలిపారు.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మల్లికార్జుననగర్‌లో అనుమానాస్పదంగా వెళ్తున్న మహిళను పట్టుకున్నట్లు కాంగ్రెస్(congress) శ్రేణులు తెలిపారు. మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని భారీ మొత్తంలో నగదు, ఓటర్ల జాబితాతో ఈ మహిళను పట్టుకున్నామని అన్నారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొంటూ మహిళను పోలీసులకు అప్పగించారు.