»Sanatana Dharma School In Dawood Ibrahim Plot Mumbai
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం ప్లాట్ లో సనాతన ధర్మ పాఠశాల
అండర్ వరల్డ్ డాన్ దావుడ్ ఇబ్రహీంకు చెందిన ఆస్తిని ఓ లాయర్ వేలంలో సొంతం చేసుకున్నారు. ఆ స్థలంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనాన్ని పునరుద్ధరించి అక్కడ సనాతన ధర్మ పాఠశాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Sanatana Dharma School in Dawood Ibrahim Plot, Mumbai
Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) ఎప్పటినుంచో పరారీలో ఉన్న విషయం తెలిసిందే. తాజగా ఆయనపై విష ప్రయోగం జరిగిందనే వార్తలతో మరోసారి నెట్టింట్లో చర్చనీయంశం అయ్యారు. తాజాగా మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దావూద్ పూర్వీకుల ఆస్తి వేలం వేశారు. కనీస ధర రూ.15 వేలుగా నిర్ణయించగా. వేలంలో రూ.2 కోట్లకు అమ్ముడుపోయింది. అందులోనే దావూద్ వారసత్వంగా వచ్చిన నాలుగు ఆస్తుల భవనం కూడా ఉంది. ఈ ఆస్తిని ఓ లాయర్ సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ముంబాకే గ్రామంలో దావూద్ పూర్వీకులు ఉండేవారు. అక్కడే తన ఆస్తి కూడా ఉంది. ఇక ముంబైలో వివిధ నేరాలకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్‌లో ఉన్నాడు.
చాలా సంవత్సరాలుగా దావుద్ లొంగిపోకపోవడంతో ఆయన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ముంబాకే లోని నాలుగు ఆస్తులను 2020లో వేలం వేసింది. దీంతో తన ఆస్తిని రూ.2.01 కోట్లు వెచ్చించి ఓ లాయర్ సొంతం చేసుకున్నాడు. సదరు లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ ప్లాట్ ను పునరుద్ధరించి సనాతన ధర్మ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఆ లాయర్ ఎవరు అన్నది గోప్యంగా ఉంచారు.