Bharathi Cement: భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ ఎఫ్డీలపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారతి సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్డీలను ఈడీ విడుదల చేయాలంటూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. భారతి సిమెంట్స్ ఎఫ్‌డీల స్థానంలో బ్యాంకు గ్యారంటీలు తీసుకుని ఎఫ్డీలను విడుదల చేయాలన్న తీర్పును మళ్లీ పరిశీలించాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
ఎఫ్డీలకు బదులుగా బ్యాంకు గ్యారంటీలను తీసుకున్న తర్వాత కూడా ఎఫ్డీలను జప్తు చేసుకుందని భారతి సిమెంట్స్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు.
ఎఫ్డీలను జప్తు చేసినా కనీసం దానిపైన వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలంటూ భారతి సిమెంట్స్ మరో పిటిషన్ దాఖలు చేసింది. అయితే భారతి సిమెంట్స్ ఐఏని కూడా సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఎఫ్డీలనే విడుదల చేయాలన్న తీర్పునే మళ్లీ పరిశీలించాలనప్పుడు వడ్డీ ఎలా వస్తుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌పై వాదనలు ముగిసినట్లేనని అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.