Telangana CM Revanth Reddy Responds To AP CM Jagan Tweet
CM Revanth Reddy: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక అంశాలపై సమీక్ష చేశారు. రేవంత్‌కు అన్ని వర్గాలు, పక్షాలు, ప్రముఖులు విష్ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం జగన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జగన్ పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో స్నేహభావం, సహకారాన్ని తమ ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం… అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. https://t.co/UsR4GyPqDR
పొరుగు రాష్ట్రాలతో అభివృద్ధిలో పరస్పర సహకారం కోరుకుంటున్నామని రేవంత్ తెలిపారు. ఇటీవల నాగార్జున సాగర్ గేట్ల వద్దకు ఏపీ పోలీసులు రాగా, ఏపీ అధికారులు నీరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ రోజే రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఏపీ తీరును కృష్ణా రివర్ బోర్డు మేనెజ్ మెంట్ కూడా తప్పు పట్టింది. తీరు మార్చుకోవాలని సూచించింది. ఆ వెంటనే జగన్ విష్ చేయడం.. సహకారం అంటూ పేర్కొనడం.. రేవంత్ రియాక్ట్ కావడం చకచకా జరిగిపోయాయి.