NDL: కోయిలకుంట్ల మండలం కలుగొట్ల, రేవనూరు గ్రామాలలో ఇవాళ ఎస్పై మల్లికార్జున ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఉన్న పలు రాజకీయ పార్టీల నాయకులకు చెందిన ఇళ్లలో, గడ్డివాములలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి రాజకీయ పార్టీల నాయకులు గొడవలు సృష్టించకుండా ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఎస్సై తెలిపారు.