ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ప్రతికార దాడులు చేయొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో పలు పోలీస్ స్టేషన్లకు భద్రతను పెంచారు. అటు RTC సర్వీసులను కూడా పలు చోట్ల కుదించి, పలు ప్రాంతాలకు పూర్తిగా రద్దు చేశారు.