ELR: భీమడోలు మండలం కురెళ్లగూడెంలోని వైర్ పంట కాల్వలో గుర్తు తెలియని మృతదేహాన్ని భీమడోలు పోలీసులు శనివారం గుర్తించారు. కొల్లేరు పొలాల్లోకి వెళ్లే వైర్ కాల్వలో సుమారు 35-45 సం.లు వ్యక్తి మృతదేహం దుర్వాసన రావడంతో గుర్తించామని SI మదీనా బాషా తెలిపారు. మృతుడు గుండుతో చేతికి కాశీ తాడు కలిగి ఉన్నాడన్నారు.