NLR: ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిన్న కార్పొరేషన్, NUDA అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఎస్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులు, లే ఔట్ల అప్రూవల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.