HYD: ఫిరాయింపు ఎమ్మెల్యే ఖైరతాబాద్ దానం నాగేందర్ రేపు తన పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆరోపణలు ఎదురొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో 8 మంది విచారణ ముగిసింది. రెండోసారి కూడా నోటీసు అందుకున్న దానం.. ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. నోటీసుల గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు ఆయన రాజీనామా చేస్తారని సమాచారం.