HNK: సంగెం మండలంలో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఉద్యోగులమని నమ్మించి ఒక వ్యక్తిని మోసం చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పేరుతో పంపిన లింక్ ఓపెన్ చేయగానే ఫోన్ హ్యాక్ అయింది. యాక్సిస్, SBI క్రెడిట్ కార్డుల నుంచి మూడు లావాదేవీల్లో రూ. 1.71 లక్షలను స్విగ్గి లిమిటెడ్ ఖాతాలకు బదిలీ చేశారు. మోసం గుర్తించిన బాధితుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్కు ఫిర్యాదు చేశాడు.