KNR: జిల్లాలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. చిగురుమామిడి, సైదాపూర్‌లో స్వశక్తి సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.