KRNL: ఈ నెల 14 నుంచి 16 వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, సీనియర్ ఉమెన్, మెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు లిఫ్టర్లు పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వీరేశ్, ముషరాఫ్, పర్వేజ్, చాంద్ బాషా, హజరత్ వలిని కలెక్టర్ డా.సిరి శనివారం అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయి వెయిట్ పోటీల్లోనూ ఇదే ప్రతిభ కనబరచాలని అన్నారు.