SKLM: ఆమదాలవలసలో మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాలలో ఈ నెల 24-29 వరకు “రైతన్న మీ కోసం” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహనరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని, రైతులకు పంటల ప్రణాళిక, ప్రభుత్వ పథకాలు, AP AIMS యాప్ వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.