»Father Assasinated To Her Daughter In Nandyal District
Nandyal పెళ్లయినా ప్రియుడితో సంబంధం.. కూతురిని అటవీ ప్రాంతంలో తీస్కెళ్లి
ఫోన్ కూడా చేయడం లేదని ప్రశ్నించడంతో ఆవేశంలో దేవేంద్ర రెడ్డి చేసిన దారుణాన్ని వివరించాడు. ఇది విన్న తాత శివారెడ్డి హతాశయుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు దేవేంద్ర రెడ్డిని తీసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో మృతదేహం కోసం పరిశీలించారు. మొదటి రోజు ఆనవాళ్లు లభించకపోవడంతో రెండో రోజు ఆమె శరీర అవయవాలు లభించాయి.
కన్న కూతురిని (Daughter) కంటికి రెప్పలా చూసుకున్నాడు.. మంచిగా చదివించాడు.. కానీ ఈలోపే యువతి ప్రేమ (Love) అంటూ ఓ యువకుడితో చనువుగా ఉంటోంది. ఇలా అయితే కూతురు బతుకు ఆగమవుతుందని గ్రహించిన ఆ తండ్రి సాఫ్ట్ వేర్ ఉద్యోగి (Software Engineer)కి ఘనంగా పెళ్లి చేయించాడు. అత్తారింటికి పంపించి తండ్రిగా తన బాధ్యతలు చేశాడు. హైదరాబాద్ (Hyderabad)లో భర్తతో చక్కగా కాపురం చేసుకోవాల్సిన కూతురు మళ్లీ తప్పటడులు వేస్తోంది. పెళ్లయినా కూడా తన ప్రియుడిని కలవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ కన్న తండ్రి తట్టుకోలేకపోయాడు. కుమార్తె భర్తను వదిలేసి పుట్టింటికి రావడంతో పరువు పోయిందని భావించాడు. దీంతో కుమార్తెను హతమార్చాడు. తల, మొండెం వేరు చేసి అటవీ ప్రాంతంలో విసిరాడు. ఇంత చేసి ఇంట్లోకి వచ్చి ఏం జరగనట్టు ఉండిపోయాడు. అయితే అమ్మాయి తాత నిలదీయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచచింది. ఈ సంఘటన ఏపీ (Andhra Pradesh)లోని నంద్యాల జిల్లా (Nandyal District)లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
నంద్యాల జిల్లా పాణ్యం (Panyam) మండలం ఆలమూరు (Alamuru) గ్రామానికి చెందిన దేవంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె స్వప్న (21)కు రెండేళ్ల కిందట సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు ఇచ్చి వివాహం జరిపించాడు. కూతురు, అల్లుడు హైదరాబాద్ లో కాపురం పెట్టారు. అయితే పెళ్లికి ముందే ప్రసన్న మరో వ్యక్తిని ఇష్టపడుతుండేది. అతడితో చాలా దగ్గరిగా ఉంటుండడంతోనే కుమార్తెకు పెళ్లి చేసి హైదరాబాద్ పంపించాడు. పెళ్లయిన కూడా ప్రియుడితో స్వప్న సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భర్తను వదిలేసి కొన్ని రోజుల కిందట పుట్టింటికి వచ్చింది. తిరిగి భర్త వద్దకు వెళ్లాలని తండ్రి కోరాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో దేవేంద్ర రెడ్డి కుమార్తెపై కోపం పెంచుకున్నాడు. భర్తను వదిలేసి పుట్టింట్లో కూతురు తిరిగి వచ్చేయడంతో గ్రామంలో తన పరువు పోయిందని భావించాడు. దీంతో ఈనెల 10వ తేదీన ఇంట్లో కుమార్తె స్వప్నను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా కొందరితో కలిసి కారులో రహాస్యంగా కుమార్తె మృతదేహాన్ని బయటకు తరలించాడు. నంద్యాల- గిద్దలూరు మార్గంలో ఉన్న అటవీ ప్రాంతంలో కుమార్తె తల, మొండాన్ని వేరు చేసి పడేశారు.
అనంతరం ఇంటికి వచ్చి ఏం జరగనట్టు కుటుంబసభ్యులతో దేవేంద్ర రెడ్డి ఉండిపోయారు. అయితే యువతి తాత శివారెడ్డి తన మనవరాలు కనిపించడం లేదని తరచూ అడుగుతున్నాడు. స్వప్న ఎక్కడికి వెళ్లిందని నిలదీశాడు. ఫోన్ కూడా చేయడం లేదని ప్రశ్నించడంతో ఆవేశంలో దేవేంద్ర రెడ్డి చేసిన దారుణాన్ని వివరించాడు. ఇది విన్న తాత శివారెడ్డి హతాశయుడయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు దేవేంద్ర రెడ్డిని తీసుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో మృతదేహం కోసం పరిశీలించారు. మొదటి రోజు ఆనవాళ్లు లభించకపోవడంతో రెండో రోజు ఆమె శరీర అవయవాలు లభించాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పాణ్యం ఎస్సై సుధాకర్ రెడ్డి తెలిపారు.