Elon Musk: ట్విట్టర్‌ను ఏ రోజతై ఎలాన్ మాస్క్ (Elon Musk) కొనుగోలు చేశాడో.. అప్పటినుంచి కొత్త విధానాలు ప్రకటిస్తూ వస్తున్నాడు. కంపెనీలో సీఈవో సహా మిగతా బాస్‌లను తొలగించేశాడు. ఉద్యోగులను కూడా కొందరినీ తీసేశాడు. ట్విట్టర్ పేరు మార్చాడు. దాంతో ట్విట్టర్ కాస్తా ఎక్స్‌గా మారింది. బ్లూ టిక్ కూడా తీసుకొచ్చాడు. సెలబ్రిటీలు నిజం అని నిర్ధారించేందుకు డాలర్ కట్టించుకున్నాడు. వారికి ట్వీట్, రిప్లై, వీడియో స్ట్రీమింగ్ అన్నీ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇప్పుడు కొత్త యూజర్లకు షాక్ ఇచ్చాడు. అవును.. ఇకపై యూజర్ల పోస్ట్, రీ ట్వీట్, రిప్లై, లైక్, బుక్ మార్స్క్, మెసేజ్ చేయాలంటే ఏడాదికి డాలర్ చెల్లించాల్సిందే అంటున్నాడు. తొలుత న్యూజిలాండ్, ఫిలిప్పిన్స్‌లో అమలు చేసి.. ఆ తర్వాత మిగతా దేశాలకు విస్తరిస్తారని చెబుతున్నాడు. స్పాట్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించే ఉద్దేశంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. డాలర్ చెల్లించని వారికి రీడ్ ఓన్లీ ఆప్షన్ ఉండనుంది. మాస్క్ నిర్ణయంపై నెటిజన్లు మాత్రం గుర్రు మీద ఉన్నారు.