గాజా(Gaza)లో దారుణం ఘటన చేటుచేసుకుంది. అక్కడి అల్ అహ్లీ ఆసుపత్రి(Al Ahli Hospital)లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఏకంగా 500 మంది మరణించారు. దీనికి ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులే కారణమని హమాస్ (Hamas) ఆరోపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే దశాబ్దాలుగా జరుగుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో ఇదే అతి పెద్ద దారుణ ఘటన అవుతుంది. మరోవైపు ఉత్తర గాజాలో ఉన్న ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లాలని ఆదేశించిన ఇజ్రాయెల్ అక్కడా బాంబు దాడులు చేస్తోంది.
దక్షిణ గాజాపై చేసిన దాడుల్లో డజన్ల సంఖ్యలో పాలస్తీనా (Palestine) వాసులు మరణించారు. వారిలో ఉత్తర గాజా నుంచి వలస వచ్చిన వారూ ఉన్నారు. ఇటు లెబనాన్ సరిహద్దులోనూ ఇజ్రాయెల్, హెజ్బొల్లా(Hezbollah) మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న గాజాకు సాయం అందించడానికి మధ్యవర్తుల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. యూదు దేశం యుద్ధ నేరానికి పాల్పడిందని మండిపడింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి తమ వద్ద ఏ సమాచారం లేదని ఇజ్రాయెలీ మిలిటరీ (Military) అధికార ప్రతినిధి వెల్లడించారు. వైమానిక దాడి జరిగిందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు
కాగా, ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్గా మారాయి. ఈ ఘటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించింది. సామాన్య పౌరుల రక్షణకు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈజిప్ట్, కెనడా కూడా ఈ దారుణాన్ని ఖండించాయి.ఐక్యరాజ్య సమితి (UNO) భద్రతా మండలిలో గాజాకు మానవతా సాయం అందించేందుకు సహకరించాలని కోరుతూ రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. బుధవారం ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Jo Biden) పర్యటించనున్నారు.