లిప్ లాక్ సీన్లపై ఇటివల యంగ్ హీరోయిన్ శ్రీలీల కామెంట్లు చేసింది. ఇప్పుడు అవి కాస్తా ఆమెకు రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె లిప్ లాక్ చేసిన హాట్ సీన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అసలు విషయమేంటో ఇప్పుడు చుద్దాం.
Netizens who commented on the lip lock scenes are playing the heroine Srileela
Srileela: టాలీవుడ్లో దూకుడు మీదున్న హీరోయిన్ శ్రీలీల(Srileela) వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తుంది.పెళ్లి సందడి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) కాంబోలో వచ్చిన ధమాకా చిత్రంతో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. ఆ తరువాత తిరిగి చూడకుండా పరిశ్రమలో బిజీగా మారిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో గుంటూరు కారం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్గా పంజా వైష్ణవ్ తేజ్ సరసన నటించిన ఆదికేశవ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని లిప్‌లాక్ (lip lock)పై తన అభిప్రాయాన్ని చెప్పింది. ఏ హీరోతో లిప్ లాక్ సీన్ చేస్తారని యాంకర్ అడిగితే..ఏ హీరోతో కిస్ చేయను అని చెప్పింది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ లిప్ లాక్ తన భర్తకే ఇస్తానని చెప్పుకొచ్చింది. ఇక తన కామెంట్స్‌ను సిరీయస్‌గా తీసుకున్న నెటిజన్లు వెతికి మరీ తన లిప్ లాస్ సీన్లను నెట్టింట వైరల్ చేస్తున్నారు. కన్నడలో నటించిన తన మొదటి కిస్ చిత్రంలోని ముద్దు సీన్ ఫ్రూఫ్‌గా చూపిస్తున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. వీడియోలో హాట్ లిప్ లాక్ ఉండటంతో అనేక మంది రకరకాలుగా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా ఇంత పవర్ ఫుల్‌గా మారిన తరువాత ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలని అంటున్నారు. పాపం శ్రీలీల ఇలా బుక్కైందేంటి అని మరికొందరు అంటున్నారు. ఈ సమయంలో ఆదికేశ సినిమా కన్నా శ్రీలీలకే ప్రోమోషన్స్ గట్టిగా జరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.