»Pawan Traveled To Italy With His Wife Annalezinova
Pawan Kalyan : భార్యతో కలిసి ఇటలీ ఫ్లైట్ ఎక్కిన పవన్!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లోనే వరుణ్ తేజ్ పెళ్లి కోసం సతీసమేతంగా ఇటలీ ఫ్లైట్ ఎక్కేశారు పవన్.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి ప్రేమించి పెళ్లికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటలీలోని టుస్కానీలో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనుల్లో బిజీగా ఉంది మెగా ఫ్యామిలీ. వరుణ్ తేజ్ పెద్దన్న రామ్ చరణ్, వదిన ఉపాసన చేతుల మీద పెళ్లి పనులు జరుగుతున్నాయి. నవంబర్ 1న ఈ పెళ్లి జరగనుంది. నవంబర్ 5న హైదరాబాద్‌లోని N కన్వెన్షన్‌లో రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. నిన్ననే కాబోయే జంట ఇటలీకి బయల్దేరారు. వరుణ్, లావణ్య ఇద్దరు కలిసి వెళ్తున్న ఎయిర్ పోర్ట్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇప్పుడు పవర్ స్టార్ కూడా వరుణ్ పెళ్లి కోసం ఇటలీ ఫ్లైట్ ఎక్కేశారు. సతీసమేతంగా ఇటలీకి బయల్దేరారు. పవన్, అన్నా లెజ్నేవా ఎయిర్ పోర్టులో కనిపించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పవన్ కాటన్ జీన్స్.. మల్టీకలర్ గళ్ల షర్ట్‌తో చేతిలో నల్ల జాకెట్‌తో కనిపించారు. ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరు కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే.. చాలా కాలం తర్వాత జంటగా మీడియాకి కనిపించడంతో పవన్ ఫ్యాన్స్ ఆ విజువల్స్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ ఇద్దరు వరుణ్ తేజ్ పెళ్లికి జంటగానే హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే.. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాల పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలు.. ఏపిలో వచ్చే ఎలక్షన్స్ లోపు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతానికి మెగా ఫ్యామిలీ అంతా ఒక్కొక్కరుగా ఇటలీ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు.