»Voting Rights Can Be Exercised In Ap As Well As Telangana
Telanganaతోపాటు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చా..?
తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. రెండు చోట్ల ఓటు ఉన్న విషయం గుర్తించే సాప్ట్ వేర్ తమ వద్ద లేదని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
Voting Rights: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి నెలకొంది. వయోజనులను ప్రలోభ పెట్టే పనిలో రాజకీయ పార్టీలు, నేతలు ఉన్నారు. నవంబర్ 30వ తేదీన తెలంగాణలో ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఈ సారి కూడా రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు (vote right) వినియోగించుకోవచ్చా..? అనే ప్రశ్న వస్తోంది.
ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో విడతల వారీగా ఎన్నికలు జరిగేవి. ఏపీలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి జరిగేవి. ఆ సమయంలో రెండు చోట్ల ఓట్లు వేసే వారు. ఆధార్ లింక్ జరిగిన తర్వాత కొన్ని ఓట్లను తొలగించారు. రాష్ట్రాలు విడిపోయు పదేళ్లు అవుతున్నాయి. దీంతో ఇప్పటికీ కొందరికీ ఏపీ, తెలంగాణలో రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. దీనిపై పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి కూడా తీసుకొచ్చాయి.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఈ అంశంపై స్పందించారు. రెండు రాష్ట్రాల్లో ఓటు ఉన్న విషయం గుర్తించే సాప్ట్ వేర్ తమ వద్ద లేదని చెప్పారు. అంటే ఇప్పటికీ ఓటు ఉన్న వారు.. ఇక్కడ, అక్కడ రెండు చోట్ల తమ ఓటును వేసే అవకాశం ఉంది. నెలల్లో ఎన్నికలు ఉండగా.. రెండు చోట్ల ఓటు వేస్తారు. వీరి వల్ల తమ విజయ అవకాశాలు దెబ్బతింటాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.