NZB: ఆర్మూర్ పట్టణంలోని ఓ షాపుపై పోలీసులు జరిపిన దాడిలో 19 చైనా మాంజా బండిళ్లను సీజ్ చేసినట్లు ఎన్.హెచ్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. షాపు యజమానులు నారాయణ, రవిలను అదుపులోకి తీసుకోగా, నిజామాబాద్‌కు చెందిన జహీర్ ఖాన్ వద్ద వీటిని కొన్నట్లు ఒప్పుకున్నారు. ఈ ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.