అన్నమయ్య: తంబళ్లపల్లె మండలంలోని జుంజురుపెంట సమీప చిన్నమూలకుంట చెరువు వద్ద కోడి పందెం జరుగుతోందన్న సమాచారం మేరకు బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందెం ఆడుతున్న 11 మందిని ఎస్ఐ అనిల్‌కుమార్ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5,900 నగదు, 5 సెల్ఫోన్లు, 4 కోడి పుంజులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.