Fake Baba బాగోతం.. కమీషన్ ఇవ్వకుంటే శాపం అని బెదిరింపులు
ఫేక్ బాబాల డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏదో ఒక పేరుతో.. మారుమూల ప్రాంతంలో వెలుస్తున్నారు. అమాయకులను నమ్మించి.. లక్షల్లో దండుకుంటున్నారు. విజయవాడలో ఓ బాబా లీలలు వెలుగులోకి వచ్చాయి.
Fake Baba Cheat Woman: కొందరి వీక్నెస్ను తమకు అనుకూలంగా మలచుకుంటారు. అలా దొంగబాబాలు (Fake Baba) పుట్టుకొచ్చారు. రోజు ఎక్కడో చోట బాబాల (Baba) మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా విజయవాడలో ఓ దొంగ బాబా (Fake Baba) మహిళను (woman) ఛీట్ చేశాడు. ఆమె స్థలం అమ్మెందుకు సాయం చేస్తానని లక్షలకు లక్షలు గుంజాడు. తర్వాత కొంత స్థలం అమ్ముడుపోగా.. అందులో కమీషన్ కావాలని అడిగాడు. అప్పుడే మొత్తం ఇచ్చా కదా అని మహిళ అనగా.. శాపం పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బెజవాడలో దొంగ బాబా మోసం బయటపడింది.
మేకులు కొట్టమని
విజయవాడలో (vijayawada) సుంకర రజనీ (rajani) అనే మహిళ ఉంటోంది. మచిలీపట్నం ఇనకుదురులో రూ.35 లక్షలతో 14 సెంట్ల స్థలం కొనుగోలు చేసింది. ఇతర కారణాలతో ఆ స్థలం విక్రయించాలని అనుకుంది. అమ్ముడు పోవడం లేదు. దీంతో ఓ బాబా (baba) గురించి తెలుసుకుంది. మౌలాల అనే బాబా వద్దకు రజనీ వచ్చింది. తన సమస్యను అతనితో చెప్పుకుంది. ఆ స్థలం విక్రయించాలంటే శాంతి చేయాలని అన్నాడు. స్థలం నలుగుదిక్కులా మేకులు కొట్టమని చెప్పాడు. ప్రత్యేకంగా పూజలు కూడా చేశాడు. ఇందుకోసం రూ.రెండున్నర లక్షలను ముక్కుపిండీ మరీ వసూల్ చేశాడు.
కమీషన్ ఇవ్వాలని పట్టు
ఆ మహిళ భూమిలో (land) 100 గజాల స్థలం ఎలాగొలా అమ్ముడుపోయేలా చేశాడు. స్థలం అమ్మిన తర్వాత డబ్బు రావడంతో ఆ బాబా (baba) ఆశ పెరిగింది. తనకు కమీషన్ ఇవ్వాలని అడిగాడు. పూజకే రూ.2.50 లక్షలు ఇచ్చాను కదా.. మళ్లీ ఏంటీ అని ఆమె ఇవ్వలేదు. ఇదే అంశంపై వారి మధ్య డిస్కషన్ జరిగింది. తనకు కమీషన్ ఇవ్వకుంటే శాపం తగులుతుందని భయపెట్టాడు. దీంతో ఆ మహిళకు సందేహాం కలిగింది. డబ్బుల కోసం తనను బాబా మోసం చేశాడని గ్రహించింది. విషయం పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అమాయకత్వమే పెట్టబడి
ఎక్కడో ఓ చోట ఫేక్ బాబాలు (fake baba) పుట్టుకొస్తున్నారు. జనం అమాయకత్వమే వారి పెట్టుబడి.. ఎంతగా నమ్మితే.. అంతలా దోచుకుంటున్నారు. బాబాలను నమ్మొద్దు.. అక్కడికి వెళ్లొద్దని మేధావులు పదే పదే కోరతారు. మీడియా కూడా అవగాహన కల్పిస్తోంది. కొందరు వినడం లేదు. కొంత డబ్బులు అప్పజెప్పినా తర్వాత అసలు విషయం తెలుసుకొని బయటపడుతున్నారు. రజనీ కూడా ఆ కోవకు చెందిన వారే.. సో.. ఇకనైనా ఎవరినీ నమ్మొద్దు.. పూజల పేరుతో జరిగే మోసాల బారిన పడొద్దని మేధావులు కోరుతున్నారు.