»Heart Attack Young Boy Collapsed While Dancing At Barat In Telangana
Heart Attack: బరాత్ లో డ్యాన్స్ చేస్తూ బొక్కబోర్లా పడిన యువకుడు.. ఇక అంతే
గుండెపోటు ఎందుకు వస్తుందో తెలియడం లేదు. అనూహ్యంగా గుండెపోటుతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిలిస్తోంది. డ్యాన్స్ చేస్తుండగా.. వర్కౌట్లు (Workouts) చేస్తుండగా.. ఏ పని చేస్తున్నా ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి హఠాన్మరణాలు (Suddenly Deaths) సంభవించడం కలకలం రేపుతున్నాయి.
ఆనందం.. సంతోషం వస్తే ఎగిరి గంతులేస్తాం.. బాధ వస్తే కుంగిపోతాం. ఏది జరిగినా అది హృదయం (Heart) నుంచే జరగాల్సి ఉంది. గుండె ద్వారా భావోద్వేగాలు కలుగుతాయి. అయితే ఇటీవల కాలంలో గుండె భావోద్వేగానాను వీటిని తట్టుకోలేకపోతున్నది. అతిగా ఆనందం వేసినా.. బాధ వేసినా గుండె తట్టుకోలేక ఆగిపోతున్నది. ఇటీవల వరుసగా గుండెపోటు (Heart Attack)లకు గురై మృతి చెందుతున్న సంఘటనల విషయంలో అదే జరుగుతున్నది. రోజుల వ్యవధిలోనే దాదాపు ఐదు మంది మృతి చెందగా తాజాగా ఓ 19 ఏళ్ల యువకుడు హఠాన్మరణం పొందాడు. పెళ్లి ఊరేగింపులో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆనందంతో జరుగుతున్న పెళ్లి వేడుక అనూహ్యంగా విషాదంగా మారింది. ఈ సంఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లా (Nirmal District)లో చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. కుభీర్ (Kubeer) మండలం పార్డి (కె) గ్రామానికి చెందిన నాయుడు కిష్టయ్య కుమారుడు రాజు శుక్రవారం భైంసా మండలం కామోల్ గ్రామంలో ఘనంగా జరిగింది. వివాహం అనంతరం తర్వాతి రోజు శనివారం రాత్రి పార్డి(కె) గ్రామంలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బరాత్ నిర్వహించారు. వరుడి బంధువుల్లో ఒకరు ముత్యం (19) బరాత్ (Barat)లో డ్యాన్స్ చేస్తున్నాడు. ఉత్సాహవంతమైన పాటకు జోరుగా స్టెప్పులేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి బొక్కబోర్లా పడ్డాడు. అందరూ ఇది చూసి అది కూడా డ్యాన్స్ (Dance)లో భాగమని భావించారు. కానీ ఎంతకీ లేవకపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు వచ్చి చూశారు. అతడు అప్పటికే మృతి చెందాడు. హుటాహుటిన భైంసా (Bhainsa)లోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రయోజనం లేదని చెప్పేశారు. ముత్యం స్వగ్రామం మహారాష్ట్రలోని శివుని గ్రామం అని బంధువులు తెలిపారు. కాగా ఈ పెళ్లిలో వారం నుంచి ముత్యం సందడి చేశాడు. ఆనందాలతో నిండాల్సిన ఆ ఇంట్లో అతడి మృతితో విషాదం అలుముకుంది.
కాగా గుండెపోటు ఎందుకు వస్తుందో తెలియడం లేదు. అనూహ్యంగా గుండెపోటుతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిలిస్తోంది. డ్యాన్స్ చేస్తుండగా.. వర్కౌట్లు (Workouts) చేస్తుండగా.. ఏ పని చేస్తున్నా ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి హఠాన్మరణాలు (Suddenly Deaths) సంభవించడం కలకలం రేపుతున్నాయి. తాజాగా పాతికేళ్లు కూడా నిండని ఓ కానిస్టేబుల్ (Constable) జిమ్ (Gym)లో కసరత్తులు చేస్తుండగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం హైదరాబాద్ (Hyderabad)లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బోయిన్ పల్లిలో విశాల్ అనే కానిస్టేబుల్ జిమ్ చేస్తూ మృతి చెందాడు.
అంతకుముందు హైదరాబాద్ (Hyderabad)లోని పాతబస్తీ కాలపత్తర్ పీఎస్ పరిధిలో మహ్మద్ రబ్బానీ అనే యువకుడు తన స్నేహితులను (friends) నవ్వుతూ పలకరిస్తూనే కింద పడిపోయాడు. మరో ఘటన గుజరాత్ లోని (Gujarat) అహ్మదాబాద్ లో జరిగింది. క్రికెట్ మ్యాచ్ (cricket match) ఆడుతున్న క్రమంలో ఓ వ్యక్తికి ఆకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చి మైదానంలోనే కిందపడిపోయాడు. అయితే ఈ సంఘటనల్లో వారిని హుటాహుటిన ఆస్పత్రు (hospital)లకు తరలించేలోపు మృతి చెంది ఉంటున్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో ఇకనైనా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.
A Young Man Died on the Spot of a Heart Attack While Dancing at a Wedding Reception in Barat in kubeer mandal of Nirmal District, Telangana. pic.twitter.com/bq5acaQdNz