Breaking: తెలంగాణలో కలకలం.. మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కళాశాల ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. అనారోగ్య సమస్యలు కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు. హర్ష మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు. అతడు తెలివైన విద్యార్థి. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. హర్షకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుసు’ అని ప్రిన్సిపల్ తెలిపాడు.
కాకతీయ వైద్య కళాశాల (Kakatiya Medical College)లో విద్యార్థిని ప్రీతి (Preethi) ఆత్మహత్యాయత్నం సంఘటన దుమారం రేగుతున్న సమయంలోనే మరో చోట ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తున్నది. చదువులో ప్రతిభ కనబరుస్తున్న అమ్మాయి అకస్మాత్తుగా బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన రేపుతున్నది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల (Nizamabad Govt Medical College)లో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఉంటున్న వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా (Mancherial District) జిన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన దాసరి హర్ష (21) నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్నాడు. యథావిధిగా శనివారం ఉదయం తోటి విద్యార్థులు కళాశాలకు వెళ్లగా హర్ష రాలేదు. తీరా వచ్చి చూడగా హర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ప్రస్తుతం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారం హర్ష పరీక్ష రాయలేదు. శనివారం కూడా బయటకు రాలేదు. అయితే హర్ష మెరుగ్గా చదువుతాడు. గత పరీక్షల్లో అత్యుత్తమంగా చదివాడు. కాగా పరీక్షల భయంతో ఆత్మహత్యకు పాల్పడే అవకాశమే లేదు. కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు.
హర్ష మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ వేధింపులకు తాళలేక ప్రీతి ఆత్మహత్యకు పాల్పడడంతో అలాంటి కారణమే హర్ష మృతికి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై విచారణ చేయాలని కుటుంబసభ్యులు, తోటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే విద్యార్థి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కళాశాల ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. అనారోగ్య సమస్యలు కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు. హర్ష మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు. అతడు తెలివైన విద్యార్థి. అన్ని పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. హర్షకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుసు’ అని ప్రిన్సిపల్ తెలిపాడు.