»Bjp Mla Raja Singh Warning To His Own Party Leaders
Raja Singh: సొంత పార్టీ నేతలపై ఫైర్.. తాటా తీస్తా అని బెదిరింపులు
సొంత పార్టీ నేతలే తన వెనక గొయ్యి తవ్వుతున్నారని.. ఇప్పుడే కాదు 2018లో కూడా ఇలానే చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత వారందరి సంగతి చెబుతానని హెచ్చరించారు.
BJP Mla Raja Singh Warning To His Own Party Leaders
Raja Singh: బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి హిందుత్వ గురించో, ప్రత్యర్థుల గురించో కాదు.. సొంత పార్టీలో ఉండి.. తనకు వెన్నుపోటు పొడిచే వారికి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలు అయ్యాక వారి పని చెబుతా అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
తన వెనక ఉండి కొందరు గొయ్యి తవ్వుతున్నారని రాజా సింగ్ (Raja Singh) ఆరోపించారు. తన వ్యుహాలను ప్రత్యర్థులకు చేరవేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెవరు ఈ పని చేస్తున్నారో.. అందరూ తనకు తెలుసు అని చెప్పారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత.. వారి పని పడతానని హెచ్చరించారు.
ఇప్పుడే కాదు 2018 ఎన్నికల సమయంలో కూడా తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారి జాబితా తన వద్ద ఉందన్నారు. తన ప్రత్యర్థులతో టచ్లో ఉన్న వారి పేర్లు కూడా తనకు తెలుసని చెప్పారు. ఎన్నికల తర్వాత అందరి పని చెబుతా అని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.
రాజా సింగ్ (Raja Singh) ఫక్తు హిందుత్వ వాది.. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ఎన్నికల ముందు ఎత్తి వేసి.. గోషామహల్ టికెట్ ఇచ్చారు. ఈ సారి తనను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని.. వారిని వదిలి పెట్టబోనని మండిపడ్డారు.