• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రతి వివరాన్ని శ్రద్ధగా నమోదు చేయాలి: కలెక్టర్

BDK: ప్రతి వివరాన్ని శ్రద్ధగా నమోదు చేయాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. పాల్వంచ టౌన్ పాలకోయ తండా ప్రాంతంలో శుక్రవారం జన గణనపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. ఫీల్డ్ ట్రైనీస్‌ను జిల్లా కలెక్టర్ అవుట్ ఫీల్డ్‌కు తీసుకెళ్లి, ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించే విధానాన్ని ప్రదర్శించారు. జనగణనలో సేకరించే సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఎంతో కీలకమన్నారు.

April 3, 2026 / 04:33 PM IST

హెల్మెట్ ధరించి ఆదర్శంగా నిలిచిన రైతు

MHBD: నెల్లికుదురు మండలంలోని కాచికల్ గ్రామానికి చెందిన గణపురం రామస్వామి అనే రైతు ఎండ తీవ్రతను తట్టుకోలేక హెల్మెట్ ధరించి తన వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే సమయంలో జిల్లా పోలీస్ శాఖ హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుండడం గమనార్హం.

April 3, 2026 / 04:32 PM IST

గన్నారంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

NZB: కోటగిరి మండలం లింగాపూర్, గన్నారం గ్రామాల్లో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవు, గేదె జాతికి చెందిన మూడు నెలల పైబడిన పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధినిరోధక టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శారద రాచప్ప పటేల్, హన్మంతు, వెటర్నరీ సిబ్బంది సుధీర్ గౌడ్, అటెండర్లు భాస్కర్, సతీష్, గోపాల మిత్ర సాయిలు, పశుమిత్ర రాజేష్‌తో పాటు పశు పెంపకందార్లు పాల్గొన్నారు.

April 3, 2026 / 04:32 PM IST

‘పార్టీ బలోపేతానికి శంకరయ్య కృషి ఎనలేనిది’

KMM: ముడిగొండ మండలం పమ్మిలో సీపీఎం నాయకుడు కామ్రేడ్ చావ శంకరయ్య 33వ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను చిలుకూరి ఉపేందర్రావు ఆవిష్కరించారు. గ్రామాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి శంకరయ్య చేసిన కృషి ఎనలేనిదని సీపీఎం మండల కార్యదర్శి వర్గ సభ్యుడు టీఎస్. కల్యాణ్ కొనియాడారు.

April 3, 2026 / 04:31 PM IST

HPV వ్యాక్సిన్ గోడప్రతులు ఆవిష్కరించిన ఎమ్మెల్యే

KNR: 14 ఏళ్ల బాలికలు HPV వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ నివారించవచ్చని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తమ్మన వేణి అంజి యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన HPV వ్యాక్సిన్ అవగాహన పోస్టర్‌ను ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.

April 3, 2026 / 04:30 PM IST

కాంగ్రెస్ గూటికి సర్పంచ్

SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి సర్పంచ్ నీల ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాతూరి వెంకట స్వామి గౌడ్, కొంగరి రవి, బొమ్మెర సంయుక్త శ్రీధర్ పాల్గొన్నారు.

April 3, 2026 / 04:30 PM IST

ఫీజు రద్దుకు ABVP డిమాండ్

MBNR: పాలమూరు యూనివర్సిటీ బీటెక్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం 47% మంది మాత్రమే పాస్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. పునర్ మూల్యాంకనం రుసుమును పూర్తిగా మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విసి శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించారు.

April 3, 2026 / 04:30 PM IST

జాతరలో దుమ్ము రేపుతున్న రహదారి!

NGKL: సలేశ్వరం జాతరకు వెళ్లే రహదారి ఎర్రమట్టి దుమ్ముతో నిండిపోయింది. వాహనాల తాకిడికి దుమ్ము భారీగా లేవడంతో తెల్లటి వాహనాలు ఎరుపు రంగులోకి మారుతున్నాయి. బైక్ భక్తులు తల నుంచి కాలి వరకు మట్టితో నిండిపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై నీళ్లు చల్లించి దుమ్ము లేవకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

April 3, 2026 / 04:30 PM IST

ముగిసిన రామాలయ ఉత్సవాలు

MDK: తూప్రాన్ పట్టణ పురాతన రామాలయంలో శుక్రవారం చక్రస్నానంతో రామాలయ శ్రీరామనవమి ఉత్సవాలను ముగించారు. గత నెల 25న ఉత్సవాలకు అంకురార్పణ చేపట్టగా, సీతారాముల కళ్యాణం, ప్రతిరోజు స్వామి వారి సేవల ఊరేగింపు చేపట్టారు. ఈరోజు ఉదయం స్వామివారికి రథోత్సవం నిర్వహించారు. అనంతరం పసుపులేరు వాగులో స్వామివారి విగ్రహాలకు మున్సిపల్ ఛైర్మన్ దంపతులు చక్రస్నానం నిర్వహించారు.

April 3, 2026 / 04:30 PM IST

ఘనంగా దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

NLG: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఇవాళ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీసీ భవనంలో ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారం శ్రీనివాస్, చేగొండి మురళి యాదవ్ తదితర నాయకులు పాల్గొని నివాళులర్పించారు.

April 3, 2026 / 04:30 PM IST

ఏఆర్ కానిస్టేబుల్ రమాదేవికి ఎమ్మెల్యే నివాళి

WGL: గ్రేటర్ వరంగల్‌లోని కొత్తపేట గ్రామానికి చెందిన ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ అంకేశ్వరపు రమాదేవి అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

April 3, 2026 / 04:28 PM IST

ప్రతి పంటకు ప్రభుత్వ మద్దతు ధర: MLA

SRD: రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిజాంపేట మండలం బాచేపల్లి PACS నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5,875 చొప్పున రైతుల నుంచి శనగలు కొనుగోలు చేస్తుందన్నారు. ఇందులో ప్రజా ప్రతినిధులు అధికారులు ఉన్నారు.

April 3, 2026 / 04:27 PM IST

పాలకుర్తిలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

JN: పాలకుర్తి మండల కేంద్రంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే కార్యక్రమాలు, వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక చర్చి నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించగా భక్తులను ఆకట్టుకుంది. చర్చి ఫాదర్ రాజా పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు శిలువ నాటకం ప్రదర్శించారు. అనంతరం పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

April 3, 2026 / 04:25 PM IST

14న మెగా రక్తదాన శిబిరం..!

KMR: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్ తెలిపారు. శిబిరంలో పాల్గొనే మొదటి 200 మంది రక్తదాతలకు హెల్మెట్‌లు అందజేస్తారని పేర్కొన్నారు.

April 3, 2026 / 04:24 PM IST

పోలీస్ కమిషనర్ కీలక ఆదేశాలు

RR: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికల సందర్భంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. 5 మందికిపైగా గుమిగూడటం నిషేధం, బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించడం నిషేధమని తెలిపారు. ఈనెల 4వ తేదీ ఉ. 6 గంటల నుంచి సా.6 గంటల వరకు నిషేధాలు అమలు ఉంటాయని, ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

April 3, 2026 / 04:22 PM IST