• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గోమాత కళ్యాణానికి కలెక్టర్, ఎస్పీలకు ఆహ్వానం

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్లోని శ్రీశ్రీ అంబత్రేయ క్షేత్రంలో ఈనెల 12న నిర్వహించనున్న గోమాత కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ ప్రీతిక్ జైన్, ఎస్పీ డా. వినీత్ కుమార్లను ఆహ్వానించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, అయ్యప్పలు వారికి ఆహ్వాన పత్రాలు అందించారు. హిందూ సంప్రదాయంలో గోమాత కళ్యాణం ఎంతో విశిష్టమైనదని తెలిపారు.

April 5, 2026 / 05:52 AM IST

మంగళగడ్డలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

MBNR: మిడ్జిల్ మండలంలోని మంగళగడ్డ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్పంచ్ చందు నాయక్ శనివారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గూడు లేని ప్రతి నిరుపేదకు సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్య దర్శి నవీన్, ఎస్టీ సెల్ నాయకుడు శ్రీనివాస్, సీతారాం, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 05:34 AM IST

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: ఎస్పీ

NGKL: జిల్లాలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ హెచ్చరించారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన కోరారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే ‘డయల్ 100’కు తెలపాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

April 5, 2026 / 05:29 AM IST

కొత్తగా రెండు ఆపరేషన్ సర్కిళ్లు: సీఎండీ

SRCL: విద్యుత్ సేవలను మరింత సామర్థవంతంగా అందించేందుకు సిరిసిల్ల జిల్లాలో రెండు కొత్తగా ఆపరేషన్ సర్కిల్ ఏర్పాటు చేస్తూ NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించి సిరిసిల్ల, వేములవాడ పారదర్శక సేవలు అందించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

April 5, 2026 / 05:18 AM IST

‘ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి’

PDPL: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి, బూత్ స్థాయి ఎలక్షన్ ఏజెంట్ల నియామకాన్ని పూర్తి చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను పూర్తి చేయాలన్నారు.

April 5, 2026 / 05:15 AM IST

‘శాతవాహన వీసీ అక్రమాలపై విచారణ జరపాలి’

KNR: శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ నియామకాలు, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే ‘అర్బన్ నక్సలైట్లు’ అంటూ ముద్ర వేయడం సరికాదన్నారు. వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి.

April 5, 2026 / 05:14 AM IST

చెన్నూరు గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

MNCL: చెన్నూరు గురుకులంలో విద్యార్థిని చనిపోయి 10రోజులు కూడా దాటకముందే మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం గురుకులంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం హాస్టల్లోనే టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈ క్రమంలో ఆమెను చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 5, 2026 / 05:01 AM IST

బాబు జగ్జీవన్ రామ్ జయంతికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

JGL: భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ఉత్సవాలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు. జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

April 5, 2026 / 05:00 AM IST

రైల్వే ప్లాట్ ఫారమ్‌పై కుప్పకూలి వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండ రైల్వే స్టేషన్ ప్లాట్ ‌ఫారమ్‌పై శనివారం ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. మృతుడిని HYDలోని బహదూర్‌పురా కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్లాట్ ఫారమ్‌పై పడిపోయిన అతడిని గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసుక...

April 5, 2026 / 04:21 AM IST

నకిలీ పత్రాలతో భూకబ్జా.. ఆరుగురి అరెస్టు

KNR: కరీంనగర్‌లో నకిలీ పత్రాలతో భూకబ్జాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను టూ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఖాళీ ప్లాట్లను లక్ష్యంగా చేసుకుని, యజమానుల వివరాలతో నకిలీ లింక్ డాక్యుమెంట్లు సృష్టించి క్రయవిక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పద్మనగర్‌లోని ఓ స్థలాన్ని ఇదే రీతిలో కబ్జా చేసిన నిందితుల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

April 5, 2026 / 04:10 AM IST

ఈనెల 6న ఫుడ్ లైసెన్స్/రిజిస్ట్రేషన్ మేళా

PDPL: ఈనెల 6న PDPL సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో 10 AM నుంచి 2:30 PM వరకు ఫుడ్ లైసెన్స్/రెన్యువల్ మేళా నిర్వహించబడుతుందని ఆహార భద్రత విభాగం అధికారులు తెలిపారు. కావున జిల్లాలో ఫుడ్ బిజినెస్ చేసే వ్యాపారులు లైసెన్స్ పొందాలని,రెన్యువల్ చేయించుకోవాలని పేర్కొన్నారు. రూమ్ నెంబర్ 104లో సరైన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

April 5, 2026 / 04:05 AM IST

‘భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్య విరుద్ధం’

VKB: కేటీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ప్రతిపక్షాలపై భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. కాంగ్రెస్ గుండాయిజం సాగిస్తోందని మండిపడ్డారు. ప్రజలే త్వరలోనే ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారనీ హెచ్చరించారు.

April 4, 2026 / 10:43 PM IST

పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం: MLA

SDPT: గజ్వేల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా జరిగిన ఈ ఘటనను ఏ విధంగానూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

April 4, 2026 / 10:21 PM IST

ఏప్రిల్ 7న గద్వాలలో మెగా జాబ్ మేళా

GDWL: భారీ ఉద్యోగ అవకాశాలతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలి అని జిల్లా ఉపాధి కల్పనాధికారి లక్ష్మి అన్నారు. ఈ నెల 7వ తేదీన (మంగళవారం) గద్వాలలోని ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి అని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 9985764544 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

April 4, 2026 / 10:20 PM IST

జీపీ సిబ్బందిపై అదనపు పనుల భారం

NRPT: జిల్లాలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ ఉద్యోగులకు సంబంధం లేని పనులు చేయించడం తగదని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గవినోళ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. వారు హక్కుల గురించి మాట్లాడలేని పరిస్థితిని అధికారులు చేయరాదన్నారు. జిల్లా కలెక్టర్, డీపీవో స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు.

April 4, 2026 / 10:07 PM IST