JGL: రాష్ట్ర క్రీడా పాఠశాలల ప్రవేశాల కోసం నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికల్లో పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. జగిత్యాలలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలబాలికలు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో జరిగే తుది ఎంపికలకు అర్హత సాధించారు. ఎంపికైన వారు ఏప్రిల్ 27న అవసరమైన ధృవపత్రాలతో హాజరుకావాలన్నారు.
కామారెడ్డి జిల్లాలో జనగణన ప్రక్రియలో భాగంగా గృహ జాబితా బ్లాకుల సృష్టి పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బ్లాకుల తయారీలో ఖచ్చితత్వం పాటించాలని, ఎన్యూమరేటర్లు పని సమానంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి లోపాలు లేకుండా పనులను వేగవంతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ ఉన్నారు
KMM: ఎర్రుపాలెంలో చింతిరాల దేవకరణ అధ్యక్షతన కార్మికుల సమావేశం మంగళవారం జరిపారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేసవి సెలవుల్లోనూ వేతనాలు చెల్లించాలని CITU జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలతో శ్రమిస్తున్న కార్మికులకు సెలవుల్లో జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని అన్నారు.
ADB: భూవివాదం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించిన ఘటన జిల్లాలో నెలకొంది. 2023లో ఇచ్చోడ మండలం 7 నంబర్ గ్రామానికి చెందిన వనోలే సూర్యకాంత్, పాండురంగ్ కలిసి ఈశ్వరరావును హత్య చేశారు. ఈ నేరం నిరూపన కావడంతో జిల్లా జడ్జి ప్రభాకర్ రావు జీవిత ఖైదు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెల్లడించారు.
WGL: నర్సంపేట పట్టణానికి చెందిన పలువురికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి “గిఫ్ట్ లక్కీ డ్రా గెలిచారు” అంటూ వరంగల్‌కు రమ్మని పిలుస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అక్కడికి వెళ్లిన తర్వాత భార్యాభర్తలు కలిసి రావాలని చెప్పి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాలని బాధితులు కోరారు.
KNR: జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను మంగళవారం అదరపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ రాజకీయ పార్టీ ప్రతినిధిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవిఎం, వివిప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.
WGL: నగరంలోని కాశీబుగ్గలో గల శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో గల దక్షిణముఖ ఆంజనేయస్వామికి మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, స్వామివారికి ఎంతో ఇష్టమైన అరటిపళ్ళతో అలంకరణ చేసారు. ఆలయ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు వంగర రవి,అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, భక్తులు, తదితరులున్నారు.
MNCL: బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మంచిర్యాలలో ఉచితంగా కంటి ఆపరేషన్‌ను చేశారు. పార్టీ నాయకుడు డాక్టర్ రఘునందన్ తన ఆసుపత్రిలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు గిరిజనులకు కంటి ఆపరేషన్లు చేసి ఉచితంగా మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మున్నారాజ సిసోడియా, గోలి రాము తదితరులు పాల్గొన్నారు.
SRCL: ప్రజా ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ రూరల్ పరిధిలో 40 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, పట్టణ అర్బన్ పరిధిలో 126 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అర్బన్ పరిధిలోని 13 లక్షల 60 వేల విలువ గల 43 మంది లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
GDWL: గద్వాల పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థిని మానస, ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ (INTSO) పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
BDK: హీరో అల్లు అర్జున్ జన్మదినం సంధర్భంగా వారి అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే రక్త దాన శిబిరం అల్లు అర్జున్ అభిమానులు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. చలనచిత్ర పరిశ్రమలో ప్రజల అభిమానం సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ అని అన్నారు.
MHBD: గూడూరు మండల కేంద్రంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల విక్రయం జరుగుతుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించి వాటిని పట్టుకున్నారు. ఖానాపురం ప్రాంతానికి చెందిన మహాలక్ష్మి గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిలిండర్లు అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఐదు గ్యాస్ సిలిండర్లను ,సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
నల్లగొండలో గడియారం సెంటర్ వద్ద ఇరాన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా AIPSO ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు కలిసి పాల్గొని “యుద్ధం ఆపు ట్రంప్” అంటూ నినాదాలు చేశారు. యుద్ధాల వల్ల పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
MBNR: జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత ఆసుపత్రి ప్రాంతంలో జరిగిన ఈ ర్యాలీలో DMHO డాక్టర్ కృష్ణ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారానే వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చని సూచించారు.
NGKL: కేటీఆర్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని, ఆయనకు అబద్ధాల్లో నోబెల్ ఇవ్వొచ్చని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రజా పాలనలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.