• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హ్యాండీక్యాప్డ్ బాలుడికి ఆర్థిక సాయం

MLG: హ్యాండీక్యాప్డ్ బాలుడికి యువజన కాంగ్రెస్ నేత కుంజ సూర్య ఆర్థిక సహాయం చేశారు. మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామానికి చెందిన అయ్యప్పకు పింఛన్ అందేలా అధికారులతో మాట్లాడారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

April 6, 2026 / 08:48 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం: అదనపు కలెక్టర్

MDK: జిల్లాలో ఏప్రిల్ 10 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 518 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, కొనుగోలు ప్రక్రియకు అవసరమైన గన్ని బ్యాగులు, తూకం యంత్రాలు, తార్పాలిన్ కవర్లు వంటి సామాగ్రిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. 

April 6, 2026 / 08:46 PM IST

కొత్తగూడ జంక్షన్ వైపు వెళ్లే మార్గంలో రహదారి పనులు

RR: కొత్తగూడలోని ట్రెంట్‌సెట్ జయభేరి కనెక్ట్ బిల్డింగ్ సమీపంలో హైటెక్స్ నుంచి కొత్తగూడ జంక్షన్ వైపు వెళ్లే మార్గంలో రహదారి పనులు (మట్టి పనులు) జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పనుల నేపథ్యంలో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలుగుతుందని వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు. లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి గమ్యాన్ని చేరాలని కోరారు.

April 6, 2026 / 08:45 PM IST

డ్రంకెన్ డ్రైవ్‌.. రూ. 10 వేల జరిమానా

MDK: మనోహరాబాద్ మండలంలో డ్రంకెన్ డ్రైవ్ వాహన తనిఖీలు పట్టుబడిన షామీర్పేటకు చెందిన రాజమౌళి కి రూ. 10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సాయి ప్రభాకర్ తీర్పు ఇచ్చినట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్సై సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు.

April 6, 2026 / 08:43 PM IST

అధైర్యం కోల్పోకుండా విగ్రహం ఏర్పాటు: ఎంపీ

RR: మన్సురాబాద్ చంద్రపురి కాలనీలో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి ఎంపీ ఈటల రాజేందర్ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు వచ్చినా అధైర్యం కోల్పోకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. చత్రపతి శివాజీ జీవితం నాయకత్వానికి, ధైర్యానికి స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నారు.

April 6, 2026 / 08:42 PM IST

విజయ డెయిరీ పార్లర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: చిన్న చింతకుంట మండలం లాల్ కోట గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో శ్రీమతి చిలుకటి సునీత నర్సింహులు గారు ఏర్పాటు చేసిన ‘విజయ డెయిరీ తెలంగాణ పార్లర్’ ను తెలంగాణ రాష్ట్ర డైరీ అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారితో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కలిసి ప్రారంభించడం జరిగింది.

April 6, 2026 / 08:40 PM IST

పోస్ట్ ఆఫీస్ పునరుద్ధరించాలని ఎంపీకి వినతి

NGKL: చెదురుపల్లిలో తొలగించిన పోస్ట్ ఆఫీస్‌ను తిరిగి ఏర్పాటు చేయాలని సర్పంచ్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో ఎంపీ మల్లు రవికి వినతిపత్రం అందజేశారు. పోస్ట్ ఆఫీస్ తొలగింపుపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. అక్రమంగా తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ నాయక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

April 6, 2026 / 08:40 PM IST

రామగుండం గనిలో ప్రథమ చికిత్సపై అవగాహన

PDPL: రామగుండంలోని GDK 1&3 ఇంక్లైన్ గనిలో ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీఎం సేఫ్టీ ఆదేశాల మేరకు ఆర్జీ-I ఏరియా జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో CPR, ఫ్రాక్చర్ చికిత్స, గాయాల నిర్వహణ, అంబులెన్స్‌లో తరలింపు వంటి అంశాలపై ప్రదర్శనలు జరిగాయి. కార్మికుల్లో అవగాహన, ఆత్మవిశ్వాసం పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.

April 6, 2026 / 08:38 PM IST

జిల్లా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన CM

అసిఫాబాద్ జిల్లా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బజార్హత్నూర్ మండలం పిప్పిరి బహిరంగ సభలో జిల్లా కలెక్టర్ కె.హరిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను ఇప్పించారు. సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నిరుపేదల సొంతింటి కల నెరవేరిందని అన్నారు. కలెక్టర్ హరిత నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

April 6, 2026 / 08:35 PM IST

నాచారంలో చలివేంద్రం ప్రారంభం

MDCL: HMT నగర్ బస్సు కూడలి వద్ద రాగిరి జ్యోతి మోహన్ రెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఛైర్మన్ మోహన్ రెడ్డి, అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మేకల శిల్పారెడ్డి, రవి నాయక్ పాల్గొన్నారు. వేసవిలో ప్రజలకు చల్లని తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాటు చేశారు.

April 6, 2026 / 08:34 PM IST

‘అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు’

JGL: మల్యాల మండల వ్యాప్తంగా పార్టీలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. సోమవారం రాజారం గ్రామానికి చెందిన పోచంపల్లి కవిత, బాలరాజు ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 6, 2026 / 08:33 PM IST

ఇంటింటికి సీపీఐ నాయకుల ప్రచారం

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని 45వ వార్డులో ఇంటింటికి సీపీఐ కార్యక్రమం సోమవారం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్యవసర సరుకులు, గ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని పేర్కొన్నారు.

April 6, 2026 / 08:32 PM IST

ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు

RR: బాటసింగారం పండ్ల మార్కెట్‌ను గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి సందర్శించి మామిడి క్రయవిక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను కమీషన్ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని, అధిక రసాయనాలు వాడిన లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. వ్యాపారులకు, వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు.

April 6, 2026 / 08:31 PM IST

‘కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి’

BDK: జూలై , నవంబర్ నెలలో అర్హత కలిగి అన్ఫిట్ చేయని కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహించాలని టీబీజీకేఎస్ చీఫ్ సెక్రటరీ కాపుకృష్ణ సోమవారం డిప్యూటీ జీఎం శివకేశవరావును కోరారు. విజిలెన్స్‌లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని అన్నారు. AITUC, INTUC కార్మిక సంఘాలు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

April 6, 2026 / 08:31 PM IST

ఉపాధి హామీ కూలి మృతి

SRCL: కోనరావుపేట మండలం మర్తన్న పేటగ్రామానికి చెందిన కొత్తకొండ దేవవ్వ (53) అనే మహిళ కూలీ సోమవారం ఉపాధి హామీ పనులలో భాగంగా పీటర్ ఛానల్ పనులు చేస్తుండగా అస్వస్థతకు లోనై స్పృహ తప్పి కుప్పకూలింది. తోటి కూలీలు గమనించి వెంటనే ఆమెను చికిత్స కోసం సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

April 6, 2026 / 08:26 PM IST