BDK: పాల్వంచ ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణతో పాటు మరో ఏడుగురికి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో మరో 10 మంది కానిస్టేబుళ్లు పాల్వంచలో విధుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.
MHBD: కామ్రేడ్ కానూరీ వెంకటేశ్వరరావు, కామ్రేడ్ పైలా వాసుదేవరావుల వర్ధంతి సందర్భంగా కొత్తగూడ మండలంలోని పాలడుగు కృష్ణ స్మారక భవనంలో వారి వర్ధంతి సభలను నిర్వహించారు. CPI(ML)న్యూడెమోక్రసీ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వారు చేసిన కృషిని కొనియాడారు.
WGL: దుగ్గొండి మండలానికి చెందిన యువ నాయకుడు పొగరు రాజేష్ ప్రారంభించిన “వారధి హోటల్”ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
WNP: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. వనపర్తి జిల్లాలో 4,949 రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాయగా 2,884 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా ఉత్తీర్ణత శాతం 58.27గా నమోదై రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. ఇక ఒకేషనల్ విభాగంలో 1,270 మంది పరీక్ష రాయగా 878 మంది పాసయ్యారు. 69.13 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 6వ స్థానాన్ని సాధించింది.
SRD: అంబేద్కర్ జయంతి సందర్భంగా కేవీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి ప్రభుత్వ ఐటీఐ కళాశాల వరకు ఆదివారం 2కే నిర్వహించారు. కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు మాణిక్యం మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన కుల రహిత సమానత్వ సాంస్కృతిక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్, నాయకులు పాల్గొన్నారు.
JN: చిల్పూరు మండలంలోని లింగంపల్లి గ్రామంలో వెంటనే గ్రామపంచాయతీ నిర్మాణం చేపట్టాలని CPM పార్టీ జిల్లా నేతలు అన్నారు. లింగంపల్లి గ్రామంలో CPM నేతలు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మించి గ్రామాన్ని అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. నేతలు ప్రభాకర్, రాజు, శ్రవణ్ ఉన్నారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన తోపారపు రాజనర్సయ్య-లక్ష్మి, తిరుమల శ్రీనివాస్ గౌడ్-జ్యోతి, అలాగే లచ్చక్కపేట గ్రామానికి చెందిన జంగం రాజేష్-మానస నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
VKB: తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బొందిలి రాజ్‌పుత్ సమాజం కమ్యూనిటీ హాల్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆదివారం రాజ్‌పుత్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. వార్డు నంబర్ 5లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
NLG: దేవరకొండ నియోజకవర్గం, దేవరకొండ పట్టణం హరిజనవాడకు చెందిన పొట్ట రవి, లక్ష్మిల కుమారుడు పొట్ట రాకేష్, హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల్లో 1000 మార్కులకు 971 మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు అతన్ని అభినందించారు.
HNK: దేశ అభివృద్ధికి యువతే ప్రధాన శక్తి అని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో IIT EXCELLENCE అవార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి స్వర్ణ హాజరయ్యారు. విద్యార్థులు చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని, యువత చేతుల్లోని దేశభవిషత్వ ఆధారపడి ఉంటుందన్నారు.
ASF: కాగజ్ నగర్ మండలంలో ఈజ్ గావ్ గ్రామంలో సిరిశెట్టి పద్మ-ఎల్లాగౌడ్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో MLA హరీష్ బాబు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలం మొదలయ్యే లోపు లబ్ధిదారులందరూ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అగ్గిల్ల సంగీత శ్రీనివాస్, బికాస్ ఘరామీ పాల్గొన్నారు.
GDWL: మానవపాడు మండలం కలుకుంట్ల-అమరవాయి రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభం విరిగే స్థితిలో వేలాడుతోంది. గత కొన్ని నెలలుగా ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాలివానల సీజన్ నేపథ్యంలో స్తంభం రోడ్డుపై పడే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
MBNR: పాల్వంచ KTPSలో రాష్ట్ర జేఏసీ పిలుపుతో కొనసాగుతున్న సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో జడ్చర్ల డివిజన్‌కు చెందిన ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు. 2016కు ముందున్న అవుట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామనిహెచ్చరించారు.
NZB: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 15,547 మంది పరీక్ష రాయగా 8,806 మంది పాసై 56.64 శాతంతో జిల్లాలో 25వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 2,562 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,272 మంది విద్యార్థులు పాసై 49.65 శాతంతో జిల్లా 33వ స్థానంలో ఉంది.
WNP: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వినూత్నంగా ముందుకొస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని మూడు కేజీబీవీల్లో నీట్, జేఈఈ, ఎంసెట్ ప్రవేశ పరీక్ష శిక్షణ తరగతులకు ఎంపిక చేసినట్లు వనపర్తి జీసీడీఓ శుభలక్ష్మి తెలిపారు. ఈ నెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు .