సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) రిమాండ్ రిపోర్టులో (remand report) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) పేరును ప్రస్తావించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate). రామచంద్ర పిళ్లై.. కవితకు బినామీ అని, ఆమె ప్రతినిధినని ఎన్నోసార్లు స్టేట్ మెంట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కవిత ఆదేశాల మేరకు ఆయన పని చేసినట్లు తెలిపింది. ఇండో స్పిరిట్ (Indo Spirits) స్థాపనలో పిళ్లైది కీలక పాత్ర అని వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టచెప్పిన సౌత్ గ్రూప్ (South Group) గుప్పిట్లో ఉన్న ఇండో స్పిరిట్ సంస్థలో కవిత (MLC Kalvakuntla Kavitha) తరఫున పిళ్ళై (Arun Ramachandra Pillai) భాగస్వామి అని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో నేరపూరిత ఆర్జన రూ.296 కోట్లుగా ఉండవచ్చునని ఆరోపించింది. ఇందులో కొంత మొత్తాన్ని రామచంద్ర పిళ్లై స్థిర, చరాస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు స్పష్టం చేసింది.
పిళ్లైని ఈడీ (ED) సోమవారం ఢిల్లీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించి, రాత్రి సమయంలో అతనిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఢిల్లీ రౌస్ అవెన్యూలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో (Special Court) హాజరు పరిచారు. రిమాండ్ రిపోర్టులో (remand report) పలు అభియోగాలు మోపారు. భారీగా ముడుపులు, సౌత్ గ్రూప్ తో కలిపి సిండికేట్ తో కూడిన ఢిల్లీ మద్యం కేసులో పిళ్లై కీలక వ్యక్తి. సౌత్ గ్రూప్ లో భాగస్వాములుగా శరత్ చంద్రారెడ్డి (sharath chandra reddy), మాగుంట శ్రీనివాసులు రెడ్డి (magunta srinivasulu reddy), మాగుంట రాఘవ్ (magunta raghava reddy), ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తదితరులు ఉన్నారు. బయట ప్రతినిధులుగా పిళ్లై (Arun Ramachandra Pillai) , అభిషేక్ బోయినపల్లి (abhishek boinpally), బుచ్చిబాబు వ్యవహరిస్తున్నట్లు ఈడీ తెలిపింది.
సౌత్ గ్రూప్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ((aam aadmi party leaders) మధ్య రాజకీయ ఒప్పందం కుదిర్చేందుకు పిళ్లై, అతని అనుచరులు పలువురు వ్యక్తులతో కలిసి వ్యవహారం నడిపారు. పెద్ద మొత్తంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు ఇచ్చి, లిక్కర్ వ్యాపారం ద్వారా రాబట్టుకోవడంలో పిళ్లై కీలక వ్యక్తి. ఎల్1 లైసెన్స్ పొందిన ఇండో స్పిరిట్స్ సంస్థలో పిళ్లైకి 32.5 శాతం, ప్రేమ్ రాహుల్ కు 32.5 శాతం, ఇండో స్పిరిట్స్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కు 35 శాతం వాటా ఉంది. అయితే కవిత బినామీ పెట్టుబడులకు పిళ్లై, మాగుంట, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్ బినామీగా ప్రేమ్ రాహుల్ ఉన్నారని తెలిపింది. అరుణ్, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబులతో కలిసి సౌత్ గ్రూప్ తరఫున వ్యవహారాలు నడిపి, తయారీదారులు, హోల్ సేలర్లు, రిటైలర్లు అంతా కుమ్మక్కు అయ్యేలా చేసి ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో 30 శాతం వరకు తమ నియంత్రణలో ఉంచుకున్నారు.
ఇండో స్పిరిట్స్ లో తాము కవిత ప్రయోజనాలకు ప్రాతనిథ్యం వహిస్తున్నట్లు పిళ్లై, మరో వ్యక్తి వాంగ్మూలం ఇచ్చారు. డాక్యుమెంట్స్ ప్రకారం ఇండో స్పిరిట్స్ లో పిళ్లై రూ.3.40 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, కవిత సూచనల మేరకు రూ.1 కోటి అతనికి ఇచ్చినట్లు దర్యాఫ్తులో వెల్లడైందని చెబుతున్నారు. ఢిల్లీలో తొమ్మిది రిటైల్ జోన్లను నియంత్రణలో పెట్టుకున్న మాగుంట అండ్ కో… సిండికేట్ గా ఏర్పడటంలో అరుణ్ పిళ్లై కీలక భూమిక పోషించాడు. ఏఏపీ నేతలకు ఇచ్చిన రూ.100 కోట్ల మొత్తాన్ని తిరిగి లిక్కర్ వ్యాపారం (Liquor Bisiness) ద్వారా రాబట్టుకోవాలని సిండికేట్ అయ్యారు. ఇందుకు ఏఏపీ ప్రతినిధి విజయ్ నాయర్, అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి తదితరులు హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ సూట్ రూంలో సమావేశమయ్యారు. ఈ చర్చల నేపథ్యంలో రూ.31 కోట్ల ముడుపులను ఢిల్లీకి పంపించారు.
ఢిల్లీలో మద్యం విధానం (delhi liquor policy case) ద్వారా 12 శాతం లాభం వచ్చేలా సిద్ధం చేసారు. అదే సమయంలో ఏఏపీకి 6 శాతం ముడుపులు వచ్చేలా ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో ప్రతి ఏటా వేలాది కోట్ల లిక్కర్ బిజినెస్ జరుగుతుంది. ఇందులో మూడొంతుల వ్యపారం ఇండో స్పిరిట్స్, బ్రిండ్కో, మహదేవ్ లిక్కర్ చేతుల్లో ఉంది. వ్యాపారం చేసిన తర్వాత ముడుపులు ముట్ట చెప్పాలని భావించినప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు అత్యవసరం కావడంతో విజయ్ నాయర్.. వారిని ఒప్పించి రూ.100 కోట్లు ముందే వచ్చేలా చేశారు. 2022 సెప్టెంబర్ 23న ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఇచ్చిన లేఖ ప్రకారం కొత్త లిక్కర్ విధానం సమయంలో ఇండో స్పిరిట్ సంస్థకు 12 శాతం లాభం కింద రూ.192 కోట్లు వచ్చాయి. ఇందులో పిళ్లై రూ.33 కోట్ల వరకు తీసుకున్నాడు. 25 కోట్లకు పైగా పిళ్ళై ఖాతాకు బదలీ అయ్యాయి. ఈడీ జనవరిలోనే 5 కోట్లకు పైగా ఆస్తులను జఫ్తు చేశాయి. ఇందులో దాదాపు రూ.300 కోట్ల అవినీతి జరిగిందని, అరుణ్ పిళ్లై నిజాలు చెప్పడం లేదని, వాస్తవాలు వెలికి తీసేందుకు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోర్టును కోరింది. కోర్టు వారం రోజుల కస్టడీకి ఈడీకి అప్పగించింది. కెమెరా ఎదుట విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను మార్చి 13వ తేదీకి వాయిదా వేశారు.