Revanth reddyపై బండి సంజయ్ గరం.. బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోటీ
Bandi sanjay:టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (revanth reddy) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) ఫైరయ్యారు. బీజేపీ(bjp)-బీఆర్ఎస్ (brs) ఒక్కటేనని.. కలిసి పోటీ చేస్తాయనే కామెంట్స్ స్పందించారు. గతంలో బీఆర్ఎస్ (brs) పార్టీతో పొత్తు పెట్టుకుంది ఎవరని అడిగారు. తమ పార్టీ ఏ రోజు ఆ పార్టీతో కలిసి పోటీ చేయలేదని తెలిపారు.
Bandi sanjay:టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (revanth reddy) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) ఫైరయ్యారు. బీజేపీ(bjp)-బీఆర్ఎస్ (brs) ఒక్కటేనని.. కలిసి పోటీ చేస్తాయనే కామెంట్స్ స్పందించారు. గతంలో బీఆర్ఎస్ (brs) పార్టీతో పొత్తు పెట్టుకుంది ఎవరని అడిగారు. తమ పార్టీ ఏ రోజు ఆ పార్టీతో కలిసి పోటీ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) బీఆర్ఎస్తో (brs) కలిసి పోటీ చేస్తాం అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా బీఆర్ఎస్ పార్టీలో చేరలేదా అని అడిగారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ (congress) బీఆర్ఎస్ (brs) కలిసి బరిలోకి దిగుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి (congress party) ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి (brs party) వేసినట్టేనని తెలిపారు. దుబ్బాక (dubbaka), మునుగోడు (munugodu), హుజురాబాద్లో (huzurabad) కాంగ్రెస్ పార్టీ (congress) పరిస్థితిని జనం చూశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గల్లీలో, ఢిల్లీలో (delhi) పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని బండి సంజయ్ (Bandi sanjay) తెలిపారు.
ఇటు గ్రేటర్ పరిధిలో నకిలీ (fake birth) బర్త్, డెత్ సర్టిఫికెట్ల (death certificates) అంశం కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపించాలని బండి సంజయ్ (Bandi sanjay) డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్లో ఉగ్రవాదులు కూడా ఫేక్ సర్టిఫికెట్లతో (fake certificates) ఉంటున్నారు.. ఇదీ బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని మండిపడ్డారు. ఓట్ల కోసం ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. దీనికి సీఎం కేసీఆర్ (cm kcr) బాధ్యత వహించాలని కోరారు.