GDWL: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అలంపూర్‌లోని ఐదో వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిసరాలలో మొలిచిన పిచ్చి మొక్కలను, కంప చెట్లను జేసీపీ సహాయంతో స్థానిక వార్డు కౌన్సిలర్ మల్లెపోగు జమ్మన్న తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పిచ్చి మొక్కలను, కంపచెట్లను తొలగించామని పేర్కొన్నారు.