PPM: మాజీ మంత్రి, మాజీ ఎంపీ, సీనియర్ టిడిపి నాయకులు శత్రు చర్ల విజయరామరాజు అనారోగ్య సమస్యలతో విశాఖలోని నారాయణ మెడిసిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకుని ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి విజయరామరాజు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.